యంగ్ హీరో కిరీటి, గ్లామరస్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘జూనియర్’(Junior Movie). జులై 18న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి నుంచి భారీ అంచనాలు అందుకున్న ఈ చిత్రానికి విడుదల తర్వాత మిశ్రమ స్పందన లభించింది. హీరో కిరీటి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ విషయంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. కథ విషయంలో మాత్రం నిరాశపరిచిందని చాలామంది సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు.
ఈ సినిమా ఒక పల్లెటూరి వాతావరణంలో సాగే ఒక ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో జీవితం, అతని తండ్రితో ఉన్న అనుబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, కథనం విషయంలో కొన్ని చోట్ల నిరాశపరిచిందని సినీ ప్రియులు తెలిపారు. మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ, సినిమా మొదటి మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
Viral Vayyari Full Video Song
ఈ చిత్రంతో హీరోగా పరిచయమైన కిరీటి రెడ్డి తన ఫస్ట్ సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు. ముఖ్యంగా ఈ మూవీలోని ‘వైరల్ వయ్యారి’ (viral vayyari) సాంగ్ మాత్రం ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఈ పాటలో శ్రీలీలతో కలిసి కిరీటి వేసిన స్టెప్పులు యువతను బాగా ఆకట్టుకున్నాయి. అతనిలో మంచి డ్యాన్స్, యాక్షన్ పెర్ఫార్మర్ ఉన్నాడని ఎంతోమంది ప్రముఖులు సైతం ప్రశంసించారు.
The sensational chartbuster of the year is here! 💥#ViralVayyari Full Video Song from #Junior is out now — vibe to the viral madness! 🔥🎶
— Aditya Music (@adityamusic) August 4, 2025
- https://t.co/WMyR8Q8AbV
A Rockstar @ThisIsDSP Musical 🎸🔥@geneliad@KireetiOfficial@sreeleela14@DOPSenthilKumar@rk91_reddy… pic.twitter.com/rXTfnH9ooH
ఇప్పుడు ఈ మూవీ నుంచి ‘వైరల్ వయ్యారి’ పూర్తి వీడియో సాంగ్ రిలీజ్ అయి సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పటికే లిరికల్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ పాట, ఇప్పుడు ఫుల్ వీడియో రూపంలో వచ్చి మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా, ఈ పాటలో శ్రీలీల తన అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్, గ్లామరస్ లుక్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఈ పాటకు అద్భుతమైన ట్యూన్, శక్తివంతమైన రిథమ్ ఉండటంతో మాస్ ప్రియులకు బాగా అట్రాక్ట్ అయింది. యువతను ఆకట్టుకునేలా ఉన్న ఈ బీట్స్ విపరీతంగా నచ్చేశాయి. ఈ సాంగ్‌కు శ్రీలీల ప్రాణం పోసిందని చెప్పాలి. తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో, ఆమె ప్రతి స్టెప్‌లోనూ ప్రత్యేకతను చూపించింది. డ్యాన్స్‌లో శ్రీలీల వేగం, స్టైల్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అలాగే ఈ పాటలో కిరీటితో ఆమె కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఇద్దరూ కలిసి చేసిన స్టెప్స్, విజువల్స్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.