Kingdom Sequel: విజయ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆగిపోయిన ‘కింగ్డమ్’ సీక్వెల్..?

విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకొని ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోవడంతో ఈ చిత్రానికి సీక్వెల్ నిలిపివేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సిఉంది.

New Update
Kingdom Sequel

Kingdom Sequel

Kingdom Sequel: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్డమ్ సినిమాను రెండు భాగాలుగా చేయాలని మొదటి నుంచే ప్లాన్ చేశారు. పెద్ద స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మీద అభిమానులు, నిర్మాణ సంస్థ, సినిమా వర్గాలు అందరూ మంచి ఆశలు పెట్టుకున్నారు. కానీ విడుదల తరువాత వచ్చిన ఫలితం మాత్రం ఆశించిన దానికి పూర్తి వ్యతిరేకంగా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ప్రేక్షకుల స్పందన కూడా బలహీనంగా ఉండడంతో, సినిమా చాలా తక్కువ రోజుల్లోనే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. దీనివల్ల నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చినట్టు సమాచారం. పెట్టిన బడ్జెట్ కూడా పూర్తిగా తిరిగి రాకపోయినందున, సినిమా బిజినెస్ మొత్తం దెబ్బతిన్నట్లు పరిశ్రమలో చర్చ నడుస్తోంది.

ఈ పరిస్థితుల్లో, కింగ్‌డమ్ రెండో భాగం పై ఇప్పుడు పెద్ద సందేహం నెలకొంది. మొదటి భాగం ఆశించిన స్థాయిలో లాభాలు ఇవ్వకపోవడం వల్ల, రెండో భాగం చేస్తే మళ్లీ వాణిజ్యపరంగా సమస్యలు వస్తాయనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, ప్రస్తుతం సీక్వెల్ పనులు నిలిపివేసినట్టు సమాచారం వస్తోంది.

ఇంకా అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడి నుంచీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో, సినిమా వర్గాల్లో ‘కింగ్డమ్ సీక్వెల్ ఆగిపోయింది’ అనే వార్త పెద్ద చర్చగా మారింది. చాలా మంది నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాలు చెబుతున్నారు. కొంత మంది అభిమానులు “రెండో భాగం వచ్చినా కథను ఎలా ముందుకు తీసుకెళ్తారు?” అని ప్రశ్నిస్తుండగా, మరికొందరు “సినిమా మొదటి పార్ట్ బలహీనంగా ఉండటంతో, సీక్వెల్ చేయకపోవడం మంచిదే” అని చెబుతున్నారు.

ఇప్పటికైతే ఈ వార్తలు కేవలం చర్చలుగా ఉన్నా, అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అయితే, కింగ్డమ్ బాక్సాఫీస్ ఫలితాలు చుస్తే, సీక్వెల్ చేసే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తోంది. సినిమా టీమ్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూడాల్సిందే.

Advertisment
తాజా కథనాలు