Bhadrakaali Trailer: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భద్రకాళి' ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే.. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కథగా ఉండబోతుందని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంతో సాగిన ఈ ట్రైలర్ డబ్బు, అధికారం అవినీతి వంటి అంశాలను చూపించారు. ఒక సాధారణ వ్యక్తి మొత్తం రాజకీయాలను ఎలా ప్రభావితం చేశాడు అనేది ఈ సినిమాలో ప్రధాన అంశం. ఇందులో విజయ్ ఆంటోనీ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. ఓ ఫ్యామిలీ మ్యాన్ గా, మరోసారి గ్యాంగ్ స్టార్ గా, ఇంకోసారి ప్రభుత్వ అధికారిగా కనిపించి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ప్రభుత్వమంతా తలలు పట్టుకుంటున్న వందల కోట్ల స్కామ్ కి హీరోకి సంబంధం ఏంటి? అసలు విజయ్ ఆంటోనీ పాత్ర ఏంటి? అనే విషయాలు సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ట్రైలర్ గ్రిప్పింగ్ విజువల్స్, ఆంటోనీ స్వరపరిచిన బ్యాక్ గ్రౌంగ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడంతో పాటు సంగీత దర్శకుడిగా కూడా వ్యవహరించారు.
#ShakthiThirumagan trailer out now 🔱
— vijayantony (@vijayantony) September 8, 2025
🔗 https://t.co/pP2xYYg4zR#ShakthiThirumaganFromSept19
11 days to go pic.twitter.com/dzgKlkdHoP
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. సర్వంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజీ ప్రొడక్షన్స్, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ , రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.
Also Read:Aa Naluguru: అప్పులు చేసి చనిపోతే ఊరంతా కదిలొచ్చింది..ఆ నలుగురు సినిమా వెనుక రియల్ స్టోరీ!
Follow Us