Sky Force: ఆన్ స్క్రీన్ లవ్ ఇంట్రెస్ట్ సారాకు కృతజ్ఞతలు.. వీర్ పహారియా కామెంట్స్

సారా అలీఖాన్, వీర్ పహారియా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'స్కై ఫోర్స్'. అయితే ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‏లో వీర్.. సారా గురించి మాట్లాడారు. షూటింగ్‏లో సారా తనకెంతో మద్దతుగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో సారా, వీర్ భార్యభర్తలుగా నటించారు.

New Update

Sky Force:  బాలీవుడ్ స్టార్ అక్షయ కుమార్, సారా అలీ ఖాన్, వీర్ పహారియా లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ  'స్కై ఫోర్స్'.  1965 ఇండియా-పాకిస్థాన్ ఎయిర్ వార్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మాణంలో  సందీప్ కెవ్లానీ & అభిషేక్ అనిల్ కపూర్ తెరకెక్కించారు. ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ ప్యాక్డ్ సీన్స్, భావోద్వేగ సన్నివేశాలతో ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. ట్రైలర్ లో వీర్ -  సారా అలీ ఖాన్ మధ్య కెమిస్ట్రీ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. కాసేపటి క్రితం విడుదలైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో వీర్ పహారియా డెబ్యూ యాక్టర్ గా పరిచయం కాబోతున్నారు. 

Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్?

సారా నా పార్ట్నర్.. 

అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న  వీర్ పహారియా తన కోస్టార్ సారాతో కలిసి నటించడంపై తన అనుభవాన్ని పంచుకున్నారు. సారా స్క్రీన్ పై నా ప్రేమికురాలిగా నటించింది. షూటింగ్ సమయంలో ఆమె నాకు చాలా సహాయంగా, మద్దతుగా నిలిచింది. డెబ్యూగా నా ప్రయాణాన్ని సులభతరం చేసినందుకు సారాకు నా కృతజ్ఞతలు అని తెలిపారు. ఇది ఇలా ఉంటే  గతంలో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ కూడా  వార్తలు వచ్చాయి. 

Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు