Matka Trailer
మట్కా ట్రైలర్
'మట్కా' ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ట్రైలర్ ను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ చిత్రబృందానికి విషెష్ తెలిపారు. ''సర్కస్‌లో జోకర్‌ను చూసి జనం అంతా నవ్వుతారు.. చప్పట్లు కొడతారు. కానీ అదే సర్కస్ లో చిన్న కర్రతో పులులను, సింహాలను ఆడించేవాడు ఒకడుంటాడు.. అలాంటోడే వీడు.. రింగ్ మాస్టర్'' అనే మాస్ డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. వరుణ్ భిన్నమైన షేడ్స్, డైలాగ్స్, యాక్షన్ హైలైట్ గా కనిపించాయి. సినిమా అంతా గ్యాంబ్లింగ్, స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అసలు వాసు దేవ్ గా ఉన్న హీరో మట్కా కింగ్ గా ఎలా మారాడు"? వరుణ్ భిన్నమైన షేడ్స్? వంటి అంశాలు ఆసక్తిని పెంచాయి.
Presenting the official trailer of #MATKA!
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 2, 2024
--https://t.co/J4iA1bKZBK
Very proud to see your hunger for unique scripts & your versatility never ceases to amaze me, my dear @IamVarunTej 😊❤️ & This one looks fabulous 👌
My best wishes to the entire team for the release on Nov… pic.twitter.com/KiwPHpCGlw
ఈ చిత్రాన్ని వైరా, SRT ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరీ, నోరా ఫతేహీ ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా