Varun Tej -Lavanya: మెగా కపుల్ వరుణ్ తేజ్ లావణ్య గతేడాది నవంబర్ 1న వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకలు ఇటలీలో టుస్కానీలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. మూడు రోజుల పాటు ఇటలీలో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలకు మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు పలువురు సెలెబ్రెటీస్ కూడా హాజరయ్యారు.
Also Read: హ్యాపీ బర్త్ డే షారుక్.. బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్!
వరుణ్ లావణ్య ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ
అయితే వరుణ్ , లావణ్య వివాహబంధంలోకి అడుగుపెట్టి నిన్నటి ఏడాది పూర్తయింది. మొదటి పెళ్లిరోజు సందర్భంగా వరుణ్- లావణ్య సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఇందులో వరుణ్, లావణ్య ఒకరిపై ఒకరు తమ ప్రేమను చెప్పుకున్నారు. అలాగే ఈ వీడియోలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ క్లిప్స్ యాడ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మొదటి పెళ్లి రోజు కానుకగా వరుణ్, లావణ్యకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట.
Also Read: బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్.. నిఖిల్ చేసిన పనికి యష్మీ ఎలిమినేటెడ్..!
పెళ్లి తర్వాత కూడా లావణ్య సినిమాలు, సీరీస్ లు చేస్తూ తన కెరీర్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా 'మిస్ పర్ఫెక్ట్' ప్రేక్షకులను అలరించింది. మరో వైపు వరుణ్ 'మట్కా' అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది.
Also Read: నాగార్జున, ధనుష్ 'కుబేర' టీజర్.. పోస్టర్ వైరల్
Also Read: బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో తెలుసా