Valentines Day Movies: వాలెంటైన్స్ డే స్పెషల్.. థియేటర్, ఓటీటీ సినిమాలివే..!

సంక్రాంతి తర్వాత థియేటర్లు, ఓటీటీలు మళ్లీ సందడిగా మారనున్నాయి. వాలెంటైన్స్ వీక్‌లో ‘3’, ‘ఆరెంజ్’, ‘లవ్ స్టోరీ’, ‘మనసంతా నువ్వే’, ‘ఏ మాయ చేసావే’ రీ-రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు కూడా జనవరి 28 నుంచి విడుదల కానున్నాయి.

New Update
Valentines Day Movies

Valentines Day Movies

Valentines Day Movies: సంక్రాంతి సందడి పూర్తయ్యింది.. ఇప్పుడు ఫిబ్రవరిలో మళ్ళీ థియేటర్లలో ప్రేక్షకులకు వినోదం అందించేందుకు కొత్త సినిమాలు, రీ-రిలీజ్ చిత్రాలు రెడీ అయ్యాయి. ముఖ్యంగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈసారి కొత్త సినిమాల కంటే పాత ప్రేమకథలు మళ్లీ వెండితెరపై మెరవనున్నాయి. ఈ వాలెంటైన్స్ వీక్‌ను టాలీవుడ్ ఒక మ్యూజిక్ ఫెస్టివల్‌లా మార్చేందుకు సిద్ధమైంది.

వాలెంటైన్స్ వీక్ స్పెషల్ రీ-రిలీజ్ సినిమాలు Re Release Movies on Valentines Day 2026

ఫిబ్రవరి 6న ధనుష్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘3’తో(Dhanush 3 Movie) రీ-రిలీజ్ పండుగ మొదలవుతుంది. అనిరుధ్ సంగీతం ఈ సినిమాను మరోసారి థియేటర్‌కు వెళ్లేలా చేస్తోంది.

ఫిబ్రవరి 7న రామ్ చరణ్ నటించిన కల్ట్ లవ్ స్టోరీ ‘ఆరెంజ్’ 4K(Orange 4k) వెర్షన్‌లో విడుదల కానుంది. హారిస్ జయరాజ్ మ్యూజిక్, అందమైన విజువల్స్ మళ్లీ మ్యాజిక్ చేయనున్నాయి.

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజు ఏకంగా మూడు ప్రేమకథలు రీ-రిలీజ్ అవుతున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’(Naga Chaitanya Love Story), యువతను ఆకట్టుకున్న ఉదయ్ కిరణ్ మూవీ ‘మనసంతా నువ్వే’(Manasantha Nuvve), అలాగే క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఏ మాయ చేసావే’(Ye Maya Chesave) ఒకే రోజు థియేటర్లలో సందడి చేయనున్నాయి. జెస్సీ-కార్తిక్ ప్రేమకథను మళ్లీ పెద్ద తెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఐదు సినిమాలు తమ మ్యూజిక్, ఎమోషన్స్ తో థియేటర్లను పండుగ వాతావరణంగా మార్చనున్నాయి.

కొత్తగా థియేటర్లలోకి వస్తున్న సినిమాలు

ఓం శాంతి శాంతి శాంతిః..

భర్త అధికారం చూపే వ్యక్తి అయితే, భార్య ఎలా ఎదురు నిలిచిందన్న కథతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 30న విడుదల కానుంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించారు.

గాంధీ టాక్స్

డైలాగ్స్ చాలా తక్కువగా ఉండే ఈ ప్రయోగాత్మక సినిమా జనవరి 30న థియేటర్లలోకి వస్తోంది. విజయ్ సేతుపతి, అదితి రావ్ హైదరీ, అరవింద్ స్వామి కీలక పాత్రల్లో నటించారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

మర్దానీ 3

మహిళల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ మూడో భాగం జనవరి 30న విడుదల కానుంది. రాణి ముఖర్జీ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

మయసభ

‘తుంబాడ్’ దర్శకుడు రాహి అనిల్ బార్వే తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 30న విడుదల కానుంది. జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రలో నటించారు.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్

  • బ్రిడ్జర్టన్ సీజన్ 4 - జనవరి 29
  • ఛాంపియన్ - జనవరి 29
  • 96 మినిట్స్ - జనవరి 30
  • మిరకిల్: ది బాయ్స్ ఆఫ్ 80 - జనవరి 30

అమెజాన్ ప్రైమ్

  • ది రెక్కింగ్ క్రూ - జనవరి 28
  • దల్‌దల్ (వెబ్‌సిరీస్) - జనవరి 30

జియో హాట్‌స్టార్

  • వండర్‌మాన్ (వెబ్‌సిరీస్) - జనవరి 28
  • సర్వం మాయ - జనవరి 30

ఈటీవీ విన్

  • గొల్ల రామవ్వ - ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉంది
Advertisment
తాజా కథనాలు