/rtv/media/media_files/2025/08/01/urfi-pic-one-2025-08-01-12-27-42.png)
బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ తన విబ్భిన్నమైన ఫ్యాషన్ సెన్స్ తో తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే ఇటీవలే లిప్ ఫిల్లర్స్ తొలగించుకున్న తర్వాత ఈమె షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఫొటోలో లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ తర్వాత ఆమె మొహమంతా ఉబ్బిపోయి కనిపించింది.
/rtv/media/media_files/2025/08/01/urfi-2025-08-01-12-28-25.png)
ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమె లుక్ పై విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. ఇప్పుడు వీటికి సమాధానంగా ఉర్ఫీ తన కొత్త లుక్ వీడియోను, ఫొటోలను పంచుకుంది.
/rtv/media/media_files/2025/08/01/urfi-pic-two-2025-08-01-12-27-42.png)
లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ తర్వాత తన ఫేస్ నార్మల్ స్థితికి వచ్చిన ఫొటోలను షేర్ చేసింది. ట్రోలింగ్, మీమ్స్ అన్నీ చూసి నాకు చాలా నవ్వొచ్చింది! ఇదిగో నా ముఖం, ఇప్పుడు ఫిల్లర్లు లేదా వాపులు లేవు అంటూ పోస్ట్ పెట్టింది.
/rtv/media/media_files/2025/08/01/urfi-pic-four-2025-08-01-12-27-42.png)
ఇదిలా ఉంటే ఉర్ఫీ ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ సెన్స్ తో ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్ చేస్తుంటుంది. కొన్ని సార్లు ఆమె ఫ్యాషన్ ఎంపికల విషయంలో ట్రోల్స్, విమర్శలు కూడా ఎదుర్కొంటుంది.
/rtv/media/media_files/2025/08/01/urfi-pic-five-2025-08-01-12-27-42.png)
ఉర్ఫీ DIY (డూ-ఇట్-యువర్ సెల్ఫ్) అవుట్ ఫిట్స్ కి బాగా ప్రసిద్ధి చెందింది. తానే స్వయంగా తన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకుంటుంది.
/rtv/media/media_files/2025/08/01/urfi-pic-six-2025-08-01-12-27-42.png)
ఉర్ఫీ టెలివిజన్ సీరియల్స్ తో నటిగా తన కెరీర్ ను ప్రారంభించింది. 'బడే భయ్యా కి దుల్హానియా', 'చంద్ర నందిని', 'మేరీ దుర్గా' సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/08/01/urfi-pic-seven-2025-08-01-12-27-42.png)
ఇటీవలే కరణ్ జోహార్ హోస్ట్ చేసిన 'ది ట్రేటర్స్ ఆఫ్ ఇండియా' అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని.. విజేతగా నిలిచింది.
/rtv/media/media_files/2025/08/01/urfi-pic-eight-2025-08-01-12-27-42.png)
ఉర్ఫీ హిందీ బిగ్ బాస్ సీజన్ 1 ఓటీటీ ఫార్మాట్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది. ఇది మాత్రమే డాన్స్ ప్లస్ ప్రో, MTV Splitsvilla 14 వంటి షోలతో కూడా అలరించింది.