Upendra: ఇటీవల కొన్ని రోజులుగా కర్ణాటకలో కొన్ని థియేటర్ల బయట తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్రో-కన్నడ కార్యకర్తలు కొన్ని తెలుగు సినిమాల పోస్టర్లను చింపివేసి, కట్‌అవుట్‌లను ధ్వంసం చేశారు. వారి వాదన ఏమిటంటే- కర్ణాటకలో విడుదలయ్యే ఇతర భాషా సినిమాల ప్రమోషనల్ పోస్టర్లపై కన్నడ భాష తప్పనిసరిగా ఉండాలి.
అయితే చాలా మంది దీనిని అసంబద్ధమైన డిమాండ్ అని పేర్కొన్నారు. ఎందుకంటే ఆ సినిమాలు కన్నడ డబ్‌డ్ వెర్షన్‌గా కాకుండా నేరుగా తెలుగు లోనే విడుదలవుతున్నాయి. అలాంటప్పుడు పోస్టర్లు తప్పనిసరిగా కన్నడలో ఉండాలనే నియమం ఎలా వుంటుందనే ప్రశ్నలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో, కర్ణాటక స్టార్ హీరో ఉపేంద్ర, త్వరలో విడుదలకానున్న రామ్ నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌లో మాట్లాడారు. ఆయన మాత్రం ఈ విషయంపై కార్యకర్తలకు మద్దతు ఇస్తూ వ్యాఖ్యానించారు.
“ప్రతీ ఒక్కరూ తమ భాషను ప్రేమిస్తారు. కాబట్టి పోస్టర్లు స్థానిక భాషలో ఉండాలి అని చెప్పడంలో తప్పు లేదు” అని ఉపేంద్ర అన్నారు. కర్ణాటక ప్రేక్షకులు ఇతర భాషా సినిమాలు కూడా తమ భాషలో డబ్ చేస్తే మరింత ప్రోత్సహిస్తారని చెప్పారు. పుష్పా 2 విజయాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.
కానీ ఇక్కడే అసలు లాజిక్ మిస్ అయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
గేమ్ చెంజర్, హరి హర వీర మల్లు, OG వంటి తెలుగు సినిమాలు నేరుగా తెలుగు లోనే విడుదల అవుతున్నాయి. వాటికి కన్నడ డబ్బింగ్ లేదంటే, పోస్టర్లను తప్పనిసరిగా కన్నడలో వేయాలనే డిమాండ్ ఎందుకు?
అయితే ఈ కోణాన్ని చెప్పినప్పటికీ, ఉపేంద్ర మళ్లీ కార్యకర్తల డిమాండ్‌ను సమర్థించారు. దీంతో ఆయన కాంటెక్స్ట్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేదా? లేక తన సినిమా రిలీజ్ ముందు వివాదాన్ని తగ్గించాలనుకుంటున్నారా? అనే అనుమానాలు వస్తున్నాయి.
చాలా మంది తెలుగు ప్రేక్షకులు బెంగళూరు, మైసూరు లాంటి నగరాల్లో పెద్ద సంఖ్యలో ఉంటారు. వారు తమ ఇష్టమైన హీరో సినిమాకి తెలుగు పోస్టర్లు పెట్టడం సర్వసాధారణం. అప్పుడు వాటిని కన్నడలో పెట్టాలని బలవంతపెట్టడం అసంబద్ధమని చాలా మంది అంటున్నారు.
ఇదిలా ఉంటే, ఉపేంద్ర - రామ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఉపేంద్ర ఒక సూపర్‌స్టార్ పాత్రలో, రామ్ అతని డైహార్డ్ ఫ్యాన్‌గా కనిపించనున్నాడు.
ప్రస్తుతం ఉపేంద్ర వ్యాఖ్యలు, భాష వివాదం, ఒకవైపు ఆయన సినిమా రిలీజ్ ఇవన్నీ కలిపి ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Upendra: భాష వివాదంపై ఉపేంద్ర సంచలన వ్యాఖ్యలు… అసలు విషయమేంటంటే..?
కన్నడ కార్యకర్తల భాష డిమాండ్లపై ఉపేంద్ర మద్దతు ఇచ్చారు, నేరుగా తెలుగులో విడుదలయ్యే సినిమాలకు కన్నడ పోస్టర్ల అవసరం ఏముంది అన్న విషయాన్ని ఆయన మిస్ చేశారని విమర్శలు వస్తున్నాయి. భాష వివాదం మధ్య ఉపేంద్ర-రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఈ 27న రిలీజ్ అవుతోంది.
Upendra