Nidhhi Agerwal: పాపం నిధి.. ఊపిరాడకుండా నలిపేసిన ఫ్యాన్స్.. వీడియో వైరల్!

రాజా సాబ్ సాంగ్ లాంచ్‌లో నిధి అగర్వాల్‌ను కొందరు అభిమానులు తోసి, ఇబ్బంది పెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇది అభిమానం కాదు, తప్పు ప్రవర్తన అని నెటిజన్లు మండిపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అభిమానులు, నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలి.

New Update
Nidhhi Agerwal

Nidhhi Agerwal

Nidhhi Agerwal: నిన్న జరిగిన రాజా సాబ్(Rajasaab) సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ ఎదుర్కొన్న పరిస్థితి తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ కార్యక్రమం అనంతరం కొందరు అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు. ఆమెపైకి ఎగబడటం, తోసుకోవడంతో పరిస్థితి చేజారిపోయింది.

స్టార్లను దగ్గరగా చూడాలనుకోవడం తప్పు కాదు. కానీ అది ఒక హద్దులో ఉండాలి. ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచన లేకుండా ప్రవర్తించడం సరైంది కాదు. ఇలాంటి ఘటనలు జరిగితే భవిష్యత్తులో హీరోలు, హీరోయిన్లు ప్రజల మధ్యకు రావడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. అభిమానులకు లభించే ఆ చిన్న అవకాశాలు కూడా కోల్పోయినట్టే అవుతుంది.

ఈ ఘటనకు అభిమానులే కాదు, నిర్వాహకుల బాధ్యత కూడా ఉంది. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ సినిమా ఈవెంట్ నిర్వహించేటప్పుడు లులు మాల్ లాంటి బిజీ ప్రదేశాన్ని ఎంచుకోవడం సరికాదు. అక్కడ ఎంత పెద్ద స్థలం ఉన్నా, ఒకేసారి వేల మంది వచ్చినప్పుడు పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో శిల్పకళా వేదిక లాంటి సురక్షిత ప్రదేశాలు మంచివి అని జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసమే మాల్స్ ఎంచుకోవడం ప్రమాదకరం.

ఈ సాంగ్ లాంచ్ హైదరాబాద్‌లోని లులు మాల్‌లో జరిగింది. నిధి అగర్వాల్‌తో పాటు హీరోయిన్ రిద్ధి కుమార్ కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. భారీగా అభిమానులు రావడంతో స్టేజ్ ముందు గుమిగూడారు. ఈవెంట్ ముగిసిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. నిధి బయటకు వెళ్తుండగా అభిమానులు ఒక్కసారిగా ఆమెపైకి వచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది చాలా కష్టపడి ఆమెను కాపాడారు. కారులో కూర్చున్నప్పుడు ఆమె “ఓ మై గాడ్.. వాట్ ది హెల్ వస్ థాట్” అంటూ షాక్ అయిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది అభిమానం కాదు, పూర్తిగా తప్పు ప్రవర్తన అని నెటిజన్లు అంటున్నారు. సింగర్ చిన్మయి కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.

మొత్తానికి, నిధి అగర్వాల్ విషయంలో జరిగింది తప్పే. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా అభిమానులు తమ ప్రవర్తన మార్చుకోవాలి. ప్రేమ హద్దులు దాటితే అది అభిమానంగా కాక వేధింపుగా మారుతుంది. ఇదిలా ఉండగా, ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా 2026 సంక్రాంతికి, జనవరి 9న విడుదల కానుంది. 

Advertisment
తాజా కథనాలు