Tollywood Workers Strike: టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. గత ఆరు రోజులుగా ఈ విషయంపై నిర్మాతలకు, కార్మికులకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. శనివారం కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. నిర్మాతల మండలి వేతనాల పెంపునకు కొన్ని షరతులతో కూడిన ప్రతిపాదనలు చేయగా.. దీనికి కార్మిక సంఘాలు ఒప్పుకోలేదు. కార్మికులను మూడు రకాలుగా విభజించి వేతనాలు పెంచాలని నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో కార్మికుల సమ్మే ఆరో రోజుకు చేరింది.
నిర్మాతల షరతులు ఏంటి..
అయితే కార్మిక సంఘాలు తమ తమ వేతనాలను 30 శాతానికి పెంచాలని డిమాండ్ చేయగా .. నిర్మాత మండలి 15 % శాతానికి పెంచుతామని కొన్ని షరతులతో కూడిన ప్రతిపాదనలను ప్రకటించింది. రోజుకు రూ. 2 వేలు లేదా అంతకంటే తక్కువ వేతనం పొందుతున్న వారికి మొదటి సంవత్సరం 15%, తర్వాత రెండేళ్ళకు 5% చొప్పున వేతనం పెంచుతామని చెప్పారు. అలాగే రూ. 1000 కంటే తక్కువ వేతనం ఉన్నవారికి మొదటి సంవత్సరం 20%, మూడో సంవత్సరం 5% పెంచుతామని అన్నారు. ఇక చిన్న సినిమాల విషయంలో పాత వేతనాలే కొనసాగుతాయని ప్రకటించింది. కానీ ఈ షరతులను కార్మికుల ఫెడరేషన్ అంగీకరించలేదు . అన్ని సంఘాల వారికి ఒకే విధంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతల షరతులను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వేతనాలను 30 శాతం పెంచితేనే షూటింగ్స్ లో పాల్గొంటామని నిరసన చేస్తున్నారు. ఈరోజు ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం ఎదుట కార్మికులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలంటూ నినాదాలు చేశారు. 24 యూనియన్ల సినీ కార్మికులు ఈ సమ్మేలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Crisis in Tollywood: Protests, shoot disruptions shake industry
— Media5Zone News (@media5zone) August 4, 2025
Producers’ Council meets at Film Chamber over key demands raised by the #FilmFederation.
Prominent producers like Allu Aravind, Shivalenka Krishnaprasad, Radha Mohan, Bapineedu & T Madhu are in attendance. pic.twitter.com/lvlBgGwVYC
Also Read: Film Fare Glamour and Style Awards: గ్రాండ్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్...తరలి వచ్చిన తారాగణం