ఫిల్మ్ ఛాంబర్ తప్పు చేసిందా?.. జానీ మాస్టర్ వ్యవహారంలో వెల్లువెత్తున్న విమర్శలు!

జానీ మాస్టర్ వ్యవహారంలో బాధిత మహిళ ముందుగా ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించింది. అయితే, ఫిల్మ్ ఛాంబర్ సరైన యాక్షన్ తీసుకోవడంలో విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది సినీ పెద్దలు సైతం ఈ విషయంపై బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

New Update
jani master

jani master

casting couch: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం కొత్తేమీ కాదు. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతీ ఇండస్ట్రీలో నటీ నటులు ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య .  చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి పెద్ద హీరోయిన్ల వరకు ఏదో ఒక సమయంలో కాస్టింగ్ కౌచ్ కు గురైన వారే. ఇండస్ట్రీలో ఎదగాలన్నా, సినిమా ఆఫర్లు రావాలన్నా పెద్దలు చెప్పింది చేయాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. వారికీ ఫేవర్ గా నడుచుకోవాల్సిందే.. ఎదురుతిరిగితే ఇండస్ట్రీలో వారి అడ్రెస్‌ లేకుండా గల్లంతు చేయాల్సిందే. ఇది అందరు చెప్పే మాట. ఒకవేళ సమస్యను ఎదిరించి దైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ చేసిన ఎవరూ పట్టించుకోరన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా కాస్టింగ్ కౌచ్ పై కంప్లైంట్స్ ఇచ్చి..  ఎటూ కాకుండా పోయిన హీరోయిన్లు కూడా ఉన్నారు. నిజానికి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి MAA అసోసియేషన్ 2019లోనే ఒక కమిటీ వేసింది. కానీ ఈ కమిటీ పేరుకు మాత్రమే ఉన్నట్లు అయ్యింది.

పట్టించుకోని కమిటీ 

ఇండస్ట్రీలో మీకు ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరకు రండి.. మీడియా దగ్గరకు వద్దు.. అని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ చెబుతోంది. మరి బాధితులు  మీడియా ముందుకు, పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు ఎందుకు వెళ్తున్నారు..? అసోసియేషన్‌లో న్యాయం జరగదేమో అని భావించే కదా? అన్న విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. స్టార్ హీరోయిన్లు సమంత, అనుష్క సైతం ఇండస్ట్రీలో మహిళల భద్రత పై గతంలో ప్రశ్నలు లేవనెత్తారు. అసలు ఆడవాళ్లకు సినిమా ఇండస్ట్రీలో రక్షణ లేదనే వాదన దశాబ్దాలుగా ఉంది. ఇప్పటికే  కొంతమంది ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. మరికొంతమంది మీడియా ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు విషయంలోనూ బాధితురాలికి అదే జరిగింది. ముందుగా బాధితురాలు కొన్నాళ్లుగా జానీ మాస్టర్ పని పేరుతో తనను వేధిస్తున్నాడని కమిటీకి ఫిర్యాదు చేసింది. కానీ అక్కడి నుంచి తాను ఆశించిన స్పందన  లేకపోవడంతో బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వ్యవహారం అంతా బయటకు వచ్చింది. 

ఇది ఇలా ఉంటే సినిమా పెద్దలు  జానీ మాస్టర్ ను కాపాడుతున్నారా ? అనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జానీ మాస్టర్‌ కేసును పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదన్నట్లుగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసు ఇంత తీవ్రతగా ఉంటే రిపోర్ట్ 90 రోజుల వరకు వస్తుందని, లేదంటే అంతకు ముందే కూడా రావచ్చని  ఫిల్మ్ ఛాంబర్ చెబుతున్న తీరు అందరికీ అసహనాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఫిల్మ్ ఛాంబర్ తీరును ప్రముఖ ప్రొడ్యూసర్ సీ.కల్యాణ్ కూడా తప్పు పడుతూ వ్యాఖ్యలు చేశారు. 

మరో వైపు టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ మాత్రం ఇండస్ట్రీలో మహిళల భద్రత పై  బాధ్యతగా ఉంటామని తెలిపింది. జానీ మాస్టర్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ముందుగా బాధితురాలు కొందరు మీడియా ప్రతినిధులను ఆశ్రయించిందని వెల్లడించారు. కానీ మీడియా మిత్రులు ఆ అమ్మాయిని ఫిల్మ్ ఛాంబర్ కు సిఫార్సు చేశారని. అలా చేయడం చాలా మంచి విషయమని మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ. గతంలోనూ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయని, మరికొన్ని అసలు తమ దృష్టికి రావడం లేదని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన కేసులను పరిష్కరించడం లేదా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. నిజానికి 2018లో ఏర్పాటైన కమిటీ నివేదికలో ఏముందో తెలిస్తే పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంటుందని కమిటీ సభ్యురాలు జాన్సీ తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు