40 ఏళ్ళ వయసులో హీరోయిన్ తో టాలీవుడ్ హీరో పెళ్లి.. అతనెవరో తెలుసా?

టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారట. 'ప్రతినిధి 2' సినిమా హీరోయిన్ సిరి లేళ్లను పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13 న ఎంగేజ్మెంట్ కూడా జరగనుందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

marrge
New Update

టాలీవుడ్ లో 40 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి చేసుకొని హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో నారా రోహిత్ కూడా ఒకరు. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. 'బాణం' సినిమాతో హీరోగా మారాడు. ఫస్ట్ మూవీతోనే యాక్టర్ గా ప్రశంసలు అందుకున్నాడు. 

తర్వాత 'సోలో' మూవీతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. అందరిలా కాకుండా రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి లాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018 వరకు వరుస సినిమాలు చేసిన ఈయన.. ఆ తర్వాత ఏమైందో తెలీదు ఆరేళ్ళ పాటూ గ్యాప్ తీసుకున్నాడు. 

publive-image

హీరోయిన్ తో పెళ్లి..

ఈ ఏడాది ‘ప్రతినిధి 2’ మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో తనతో కలిసి నటించిన హీరోయిన్నే నారా రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నారట. అంతేకాదు ఈ నెల 13 న ప్రతినిధి హీరోయిన్ సిరి లేళ్లతో నారా రోహిత్ ఎంగేజ్ మెంట్ కూడా జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 

హైదరాబాద్‌లో జరిగే ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీలు కూడా హాజరు కాబోతున్నాయని సమాచారం. అయితే దీనిపై నారా ఫ్యామిలీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

#nara-rohit
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe