kula shekar: టాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ కుల శేఖర్ తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో ఈరోజు కన్నుమూసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. 'చిత్రం' సినిమాతో లిరిక్ రైటర్ గా కెరీర్ మొదలు పెట్టిన కుల శేఖర్.. 100 సినిమాలకు పాటలు రాశారు. కెరీర్ ప్రారంభంలో దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు తెలుసుకున్నాడు.
Also Read : ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!
సూపర్ హిట్ సినిమాలకు పాటలు
ఆ తర్వాత దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ దగ్గర కాంబోలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశారు. 'జయం, ఘర్షణ, వసంతం, సుబ్బు, నువ్వు నేను' లాంటి సూపట్ సినిమాలకు చార్ట్ బస్టర్స్ అందించారు. అయితే కొంతకాలంగా ఆయన ఆర్థిక, మానసిక స్థితి సరిగా లేదు. అతని స్నేహితులు సమాచారం ప్రకారం 2008 లో అతను మెదడుకు సంబంధించిన వ్యాధి బారిన పడి జ్ఞాపకశక్తిని కోల్పోయాడని తెలిపారు. కుల శేఖర్ 2013 అక్టోబరు 24 న కాకినాడలో శ్రీబాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపాన్ని దొంగలించిన కేసులో అరెస్టు అయ్యారు. ఆరునెలల జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత పోలీసులు విచారణ జరపగా.. మానసిక స్థితి సరిగా లేదని తేలింది.
అనంతరం అతడిని వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు.
Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్!