Samantha: దసరా సందర్భంగా పలు చోట్ల దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిన్న తొలి రోజు కావడంతో దేశవ్యాప్తంగా భక్తులు సందడిగా నవరాత్రి పూజలు చేసుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటి సమంత కూడా తమిళనాడు కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో నిర్వహించిన దేవి నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడ లింగ భైరవి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత తన ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సమంత పై మంత్రి సురేఖ వ్యాఖ్యలు
ఇది ఇలా ఉంటే సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ను విమర్శించే క్రమంలో.. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి సురేఖ వ్యాఖ్యలను అక్కినేని కుటుంబం, సమంతతో సహా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. గౌరవప్రదమైన ఒక మంత్రి హోదాలో ఉండి.. ఇలాంటి మాటలు మాట్లాడడం ఏ మాత్రం సరికాదని ఆమె పై మండిపడుతున్నారు.
ఇక ఈ విషయం పై మంత్రి సురేఖ స్పందిస్తూ.. సమంతకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. మరోవైపు నాగార్జున నాంపల్లి కోర్టులో కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబానికి సురేఖ భంగం కలిగించారని.. ఆమె పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున తన పీటీషన్ లో మెన్షన్ చేశారు.
Also Read: రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇంటికి చేరిన తలైవా