/rtv/media/media_files/2026/03/08/bellamkonda-2026-03-08-16-43-17.jpg)
టాలీవుడ్‌లో వరుస పెళ్లిళ్లతో సందడి నెలకొంది. మొన్న విజయ్ దేవరకొండ, నిన్న అల్లు శిరీష్ పెళ్లి పీటలు ఎక్కగా.. ఇప్పుడు ఆ లిస్టులోకి టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చేరిపోయారు. త్వరలోనే ఈ 'అల్లుడు శీను' ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా ఆదివారం ఉదయం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం చాలా సింపుల్‌గా జరిగిపోయింది. ఈ వేడుకకు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త మీనన్ వంటి కొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరో
— News Now SamacharaM (@Now_SamacharaM) March 8, 2026
టాలీవుడ్ యంగ్ హీరో, నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు సాయి శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డితో ఆయన నిశ్చితార్థం జరిగింది.
కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన కొద్దిమంది మధ్య ఈ వేడుక… pic.twitter.com/Jq12bhUK7P
హైదరాబాద్‌కే చెందిన అమ్మాయి
సాయి శ్రీనివాస్ చేసుకోబోయే అమ్మాయి పేరు కావ్య. ఈమె హైదరాబాద్‌కే చెందిన అమ్మాయి. అయితే ఈమెకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, పెద్దల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారని సమాచారం.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్.. మొదటి సినిమాతోనే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'జయ జానకి నాయక', 'రాక్షసుడు' వంటి హిట్లతో అలరించిన ఆయన, ప్రస్తుతం 'హైందవ', 'టైసన్ నాయుడు' వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. షూటింగ్ గ్యాప్‌లోనే ఇలా పెళ్లి పనులు కూడా చక్కబెట్టేస్తున్నారు. మార్చి నెలలోనే వీరి వివాహం అట్టహాసంగా జరగనున్నట్లు తెలుస్తోంది.
Follow Us