/rtv/media/media_files/2026/02/03/ott-movies-2026-02-03-11-44-26.jpg)
OTT Movies
OTT Movies: ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే ఎక్కువగా విడుదల అవుతున్నాయి. కథ, ఎమోషన్స్, కొత్త కాన్సెప్ట్‌లతో ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
శ్రీ చిదంబరం గారు వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ప్రమోషనల్ వీడియోల ద్వారా తెలుస్తోంది.
యుఫోరియా
భూమిక, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘యుఫోరియా’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల అవుతుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం తెలిపింది.
సుమతీ శతకం
బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ హీరోగా నటించిన సినిమా ‘సుమతీ శతకం’. సైలీ చౌదరి హీరోయిన్. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో కామెడీ, యాక్షన్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 6న థియేటర్లకు రానుంది.
హనీ
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హనీ’. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మూఢ నమ్మకాల నేపథ్యంలో సాగుతుంది. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు భయం కలిగించేలా ఉంటుందని సమాచారం.
విత్ లవ్
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో గుర్తింపు పొందిన అభిషన్ జీవింత్ ఇప్పుడు హీరోగా నటించిన చిత్రం ‘విత్ లవ్’. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. మంచి ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా మన జీవితాల్లోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.
వీటితో పాటు ఆపరేషన్ పద్మ, లగ్గం, వధ్ 2 వంటి సినిమాలు కూడా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
క్యాష్ క్వీన్స్ (వెబ్‌సిరీస్) - ఫిబ్రవరి 4
ది లింకన్ లాయర్ సీజన్ 4 (వెబ్‌సిరీస్) - ఫిబ్రవరి 5
సాల్వడర్ (వెబ్‌సిరీస్) - ఫిబ్రవరి 6
అమెజాన్ ప్రైమ్ వీడియో
నారి నారి నడుమ మురారి (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 4
రిలేషన్‌షిప్ గోల్స్ (మూవీ) - ఫిబ్రవరి 4
ఫైండింగ్ హార్మోనీ (మూవీ) - ఫిబ్రవరి 6
ఎల్‌వోఎల్ (వెబ్‌సిరీస్) - ఫిబ్రవరి 6
జియో హాట్‌స్టార్
ది ఫిఫ్టీ (రియాలిటీ షో) - ప్రస్తుతం స్ట్రీమింగ్
ది రాజాసాబ్ (మూవీ) - ఫిబ్రవరి 6
జీ5
షబద్ రీత్ ఔర్ రివాజ్ (సిరీస్) - ఫిబ్రవరి 6
సోనీ లివ్
జాజ్ సిటీ (వెబ్‌సిరీస్) - ఫిబ్రవరి 6
ఆహా
సైక్ సిద్ధార్థ్ (తెలుగు మూవీ) - ఫిబ్రవరి 4
Follow Us