వాతి కమింగ్.. 'మాస్టర్' రీ రిలీజ్.. అక్కడ మాత్రమే

తమిళ్ స్టార్ విజయ్ దళపతి బ్లాక్ బస్టర్ 'మాస్టర్' రీ రిలీజ్ కి సిద్ధమైంది. విజయ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 32 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 1న విడుదల కానుంది.

New Update

'Master' re- release: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలను మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ ట్రెండ్ ని బాగానే ఇష్టపడుతున్నారు. తమ వింటేజ్ హీరోలను మరోసారి తెరపై చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే రీ రిలీజైన పలు స్టార్ హీరోల సినిమాలు.. అదే క్రేజ్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపాయి. ఇప్పుడు ఈ రీ రిలీజ్ ట్రెండ్ లిస్ట్ లో మరో సినిమా చేరింది. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

విజయ్ దళపతి 'మాస్టర్' రీ రిలీజ్

తమిళ్ స్టార్ విజయ్ దళపతి కాంబోలో వచ్చిన  బ్లాక్ బస్టర్ హిట్  'మాస్టర్' మూడేళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధమైంది. విజయ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 32 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'మాస్టర్' చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 1న బెంగళూరులోని ప్రసన్న థియేటర్‌లో రీ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. 2021లో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ.250 కోట్ల బిజినెస్ చేసింది. ఈ చిత్రంలో విజయ్, విజయ్ సేతుపతి మధ్య యాక్షన్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో విజయ్ సేతుపతి భయంకరమైన విలన్ గా పాత్రలో కనిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలోని 'వాతి కమింగ్' అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్  చేసింది. 

ప్రస్తుతం విజయ్ 'దళపతి 69'తో బిజీగా ఉన్నారు. హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విజయ్ చిత్రం కాబోతుంది. దీని తర్వాత విజయ్ పూర్తిగా  సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి రానున్నారు. 

Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా

Advertisment
Advertisment
తాజా కథనాలు