/rtv/media/media_files/2026/01/03/jana-nayagan-2026-01-03-09-25-50.jpg)
Jana Nayagan
Jana Nayagan: కోలీవుడ్ టాప్ స్టార్ దళపతి విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న లాస్ట్ మూవీ ‘జన నాయగన్’ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు పెంచుకుంటోంది. సంక్రాంతి సీజన్‌లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా, రిలీజ్‌కు ఇంకా వారం రోజులు టైమ్ ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతుండటంతో అభిమానుల్లో క్రేజ్ మరింత పెరిగింది.
ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విజయ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ వల్ల టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. ఇప్పటివరకు ఓవర్సీస్‌లో మాత్రమే 1.65 మిలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.14.85 కోట్ల గ్రాస్ బుకింగ్స్ నమోదు చేసింది.
ఇక ఇండియాలో బుకింగ్స్ ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఓపెన్ అయ్యాయి. కేరళలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మంచి జోరు చూపిస్తున్నాయి. అక్కడ ఇప్పటికే రూ.1.5 కోట్లకు పైగా బుకింగ్స్ నమోదు కావడం విశేషం. తమిళనాడు బుకింగ్స్ ఇంకా పూర్తిగా ఓపెన్ కాకపోయినా, తమిళ్, కేరళ కలిపి ఇప్పటివరకు రూ.3.25 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ సాధించింది.
మొత్తంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.19.5 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు కావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ స్థాయి బుకింగ్స్ రావడం సినిమా మీద ఉన్న అంచనాలకు నిదర్శనం అని చెప్పొచ్చు. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ నంబర్లు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంకా ముఖ్యంగా తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిగా ఓపెన్ అయితే, సినిమా ఓపెనింగ్ డే రికార్డులు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. తమిళ సినిమాల చరిత్రలోనే ఒక భారీ ఓపెనింగ్ అందుకునే అవకాశం ‘జన నాయగన్’కు ఉందని టాక్ నడుస్తోంది.
ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి మరో కారణం కూడా ఉంది. ఇది విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు నటిస్తున్న చివరి సినిమా కావడం. అలాగే ఈ సినిమా కథపై కొన్ని రీమేక్ వార్తలు వచ్చినా, దర్శకుడు హెచ్. వినోద్ వాటిపై క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా దళపతి విజయ్ సినిమా అని, ప్రేక్షకులు ఒక షో చూసి తామే నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలిపారు.
మొత్తానికి, ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ తుఫాన్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సిందే.
Follow Us