/rtv/media/media_files/2025/10/14/telusu-kada-trailer-2025-10-14-11-29-49.jpg)
Telusu Kada
Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టీ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా Telusu Kada త్వరలో Netflix లో(Telusu Kada OTT) స్ట్రీమింగ్ కోసం సిద్ధమవుతోంది. ఈ సినిమా నవంబర్ 14, 2025 నుండి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వస్తుంది.
'తెలుసు కదా' ని డెబ్యూట్ డైరెక్టర్ నీరజ కోన దర్శకత్వం వహించారు. T.G. విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్లా ప్రొడ్యూసర్‌గా People Media Factory బ్యానర్‌లో నిర్మించారు. సినిమాకు సంగీతం తమన్ ఎస్ ఎస్ అందించారు. థియేటర్స్‌లో సినిమా అక్టోబర్ 17, 2025న విడుదల అయ్యింది, భారతదేశం, విదేశాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కథ:
కథలో వరుణ్, ఒక ప్రొఫెషనల్ చెఫ్, మ్యారేజ్ పోర్టల్స్ ద్వారా అంజలిని కలుస్తాడు. వారి ప్రేమ అనుకోకుండా వేగంగా అభివృద్ధి చెందుతుంది. వివాహం చేసుకుంటారు. ఫ్యామిలీ ప్లానింగ్ సమయంలో, అంజలి గర్భం కష్టాలు ఎదుర్కొంటుంది. వైద్య సలహాతో, వారు IVF స్పెషలిస్ట్ ని సంప్రదించి, సరోగసీ ద్వారా బిడ్డని కనడానికి నిర్ణయించుకుంటారు. ఈ సర్పోగసీ చేసే డాక్టర్ వారి ఇంట్లో చేరి, వారి రోజువారీ జీవితంలో, సంబంధాలలో మార్పులు తీసుకురావడం ద్వారా కొత్త విషయాలు బయట పడతాయి. అసలు వీరి ముగ్గురి మధ్య ఏం జరుగుతోందో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. సినిమాలో హర్ష చేముడు కూడా కీలక సపోర్టింగ్ పాత్రలో కనిపించారు.
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ VS
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైన్: శీతల్ శర్మ, లంకా సంతోషి
ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్: ఎస్. వెంకటరత్నం, సుకుమార్ కిన్నెరా
PRO: వంశి శేఖర్
చీఫ్ కో-డైరెక్టర్: శివ రామకృష్ణ
డైరెక్షన్ టీం: అనిల్ కుమార్ బాలగ, రాకేష్, లక్కీ దిలీప్, పిడుగు విశ్వనాథ్, దీపక్ రాజా, కుందన కిలారు, అంబికా.
మార్కెటింగ్: ఫస్ట్ షో, చీఫ్ కోఆర్డినేటర్: మేఘా శ్యామ్ పాఠడ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి.
“తెలుసు కదా” తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లో కూడా చూడవచ్చు. సినిమా థియేటర్స్ నుంచి డిజిటల్ స్క్రీన్‌కు మారిన తర్వాత, Netflix ద్వారా అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు.
ప్రేమ, కుటుంబ సమస్యలు, సర్కాస్టిక్ కామెడీ, ఎమోషనల్ డ్రామా అన్నీ కలిసిన ఈ సినిమా, ప్రేక్షకులను థియేటర్స్ లో ఆకట్టుకున్నట్లే, డిజిటల్‌లో కూడా అదే ఎంటర్టైన్‌మెంట్ అందిస్తుంది అని మూవీ టీమ్ నమ్ముతున్నారు. నవంబర్ 14 నుంచి Netflix లో చూసి వరుణ్-అంజలి ప్రేమ కథతో మళ్లీ కనెక్ట్ అవ్వండి.
Follow Us