/rtv/media/media_files/2025/12/23/the-odyssey-2025-12-23-14-15-07.jpg)
The Odyssey
The Odyssey: ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మరో భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లర్, టెనెట్, ఓపెన్‌హైమర్ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ది ఒడిస్సీ. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.
The Odyssey Telugu Trailer
ప్రముఖ గ్రీక్ పురాణ గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నోలన్‌కు ఉన్న ప్రపంచవ్యాప్త అభిమానుల కారణంగా, సినిమా విడుదలకు దాదాపు ఏడాది ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయన్న వార్తలు కూడా వచ్చాయి. ఇది ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది.
తాజాగా విడుదలైన ట్రైలర్ ట్రోజన్ యుద్ధం నేపథ్యంగా సాగుతుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ మ్యాట్ డేమన్ గ్రీక్ వీరుడు ఒడిసియస్ పాత్రలో నటిస్తున్నారు. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత తన సైనికులతో కలిసి స్వదేశానికి తిరిగి వెళ్లే ప్రయాణం ఆయన పాత్ర కథ. యుద్ధంలో ఎదురైన కష్టాలు, హింస, మరణాలు చాలనట్లుగా ఇంటికి వెళ్లే ప్రయాణం కూడా అంతే ప్రమాదకరంగా మారుతుంది.
కుటుంబాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో ఒడిసియస్ ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొనే సంఘటనలే ఈ సినిమా ప్రధాన కథాంశం. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉండటంతో, నోలన్ ఈ కథను ఎంత పెద్ద స్థాయిలో తెరకెక్కిస్తున్నారో అర్థమవుతుంది.
ఈ చిత్రంలో అన్నే హాతవే ఒడిసియస్ భార్య పెనెలోపీ పాత్రలో కనిపించనున్నారు. అతని కుమారుడు టెలిమకస్ పాత్రలో టామ్ హాలండ్ నటిస్తున్నారు. అలాగే జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్ తదితర ప్రముఖ నటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
సుమారు 2250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2026 జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్‌తోనే భారీ అంచనాలు పెరిగాయి, సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Follow Us