Teja Sajja: ఎన్టీఆర్, ప్రభాస్ తర్వాత.. ఆ రికార్డ్ మన తేజ సజ్జదే తెలుసా!

కుర్ర హీరో తేజ సజ్జ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ తో ఊపు మీదున్నాడు. హనుమాన్, మిరాయ్ వంటి సూపర్ హీరో చిత్రాలతో వరుసగా రూ. 100 కోట్లు కొల్లగొట్టాడు.

New Update
Teja Sajja

Teja Sajja

కుర్ర హీరో తేజ సజ్జ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ తో ఊపు మీదున్నాడు. హనుమాన్, మిరాయ్ వంటి సూపర్ హీరో చిత్రాలతో వరుసగా రూ. 100 కోట్లు కొల్లగొట్టాడు. చిన్న హీరో అంటూ విమర్శించిన వాళ్ళ నోళ్లు మూయించాడు. తాజాగా విడుదలైన మిరాయ్ కేవలం 7 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. ఇండియాతో పాటు ఓవర్ సీస్ లోనూ రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు అమెరికాలో $2.5 మిలియన్  వసూళ్లు సాధించి. ఇప్పుడు $3 మిలియన్ల వైపు పయనిస్తోంది. ఓవర్ సీస్ లో తేజ వరుసగా $2.5 మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడం ఇది రెండోసారి. గతంలో విడుడుదలైన  'హనుమాన్'  కూడా అమెరికాలో 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. 

ఎన్టీఆర్, ప్రభాస్ తర్వాత.. 

ఓవర్ సీస్ లో వరుసగా $2.5 మిలియన్  మార్క్ అందుకున్న హీరోగా అరుదైన ఘనత సాధించాడు. గతంలో విడుడుదలైన  'హనుమాన్'  కూడా అమెరికాలో 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.  స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఓవర్ సీస్ లో ఈ రేర్ ఫీట్ సాధించిన మూడవ హీరో తేజ సజ్జ. 

 బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఇంతటి భారీ విజయాలను సాధించడం తేజ కెరీర్ గ్రోత్,  అతడి  బాక్సాఫీస్ స్టామినాకు  నిదర్శనంగా నిలిచింది. అలాగే విదేశాల్లో కూడా అతడికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 7 రోజుల్లోనే  రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన 'మిరాయ్' ఎనిమిదవ రోజు కూడా స్ట్రాంగ్ నెంబర్స్ నమోదు చేసింది. ఎనిమిదవ రోజు (శనివారం) మాత్రమే, బుక్‌మైషోలో 1.2 లక్షలకు పైగా  'మిరాయ్' టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీంతో రెండవ వారం కూడా ఈ సినిమా సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది. మొత్తం తొమ్మిది రోజుల్లో మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల వసూళ్లు రాబట్టి.. నిర్మాతలను లాభాల బాటలోకి నెట్టింది. 

మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందిన 'మిరాయ్' చిత్రాన్ని కార్తిక్ ఘట్టమని తెరకెక్కించారు. తేజ సజ్జా, మంచు  రితికా, శ్రియా, జగపతి బాబు, గెటప్ శ్రీను  తదితరులు ఇందులో కీలక పాత్రలో పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ దీనిని నిర్మించారు. అశోకుడి కాలం నాటి తొమ్మిది గ్రంథాల నేపథ్యంలో సినిమాను రూపొందించారు.  ఇందులో తేజ అశోకుడి కాలం నాటి తొమ్మిది శక్తివంతమైన గ్రంథాలను కాపాడే యోధుడి పాత్రలో నటించారు. మంచు మనోజ్ ఆ గ్రంథాలను దక్కించుకునే దుష్ట శక్తిగా ఉంటాడు. సినిమాలో సూపర్ హీరోగా తేజ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు, స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాలోని వీఎఫెక్స్ పై సర్వత్రా ప్రశంసలు వినిపించాయి. తక్కువ బడ్జెట్ లో హాలీవుడ్ రేంజ్ వీఎఫెక్స్ అందించినట్లు విమర్శకులు తెలిపారు. 

Also Read: Priyanka Kumar: బీచ్‌లో నాజుకైన నడుము చూపిస్తూ ప్రియాంక అందాలు.. కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న కన్నడ బ్యూటీ!

Advertisment
తాజా కథనాలు