/rtv/media/media_files/2026/02/17/naga-chaitanya-2026-02-17-07-43-30.jpg)
Naga Chaitanya
Naga Chaitanya: 'పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి సినిమాలతో తన ప్రత్యేక శైలిని చూపించాడు. అతని సినిమాలు యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. డైలాగులు సింపుల్‌గా ఉండినా కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి.
ఇటీవల నటుడిగానూ బిజీగా మారిన తరుణ్, వరుసగా సినిమాలు చేస్తున్నారు. ‘ఓం శాంతి శాంతి శాంతి’ ఇప్పటికే విడుదలైంది. ‘గాయపడ్డ సింహం’ త్వరలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అదే సమయంలో దర్శకుడిగానూ కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టాడు.
ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. దసరా సమయానికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ‘పెళ్లి చూపులు 2’ ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. అయితే అందులో విజయ్ దేవరకొండ నటిస్తాడా లేదా కొత్త హీరోను తీసుకుంటారా అన్నది ఇంకా క్లారిటీ లేదు.
ఇక ఆసక్తికర విషయం ఏమిటంటే, నాగ చైతన్య కోసం తరుణ్ భాస్కర్ ఓ కథ సిద్ధం చేశారట. ఆ కథ చైతూకి కూడా నచ్చిందని సమాచారం. స్క్రిప్ట్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ‘ఈ నగరానికి ఏమైంది 2’ తర్వాత తరుణ్ చేసే సినిమా ఇదే కావొచ్చు.
మరోవైపు వెంకటేష్ కోసం కూడా తరుణ్ ఓ కథ సిద్ధం చేశారట. అయితే రెండో భాగంలో మార్పులు చేయాలని వెంకీ సూచించడంతో ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిలిచిపోయింది.
ప్రస్తుతం నాగ చైతన్య ‘వృషకర్మ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే నాగార్జున - కళ్యాణ్ కృష్ణ కాంబోలో వచ్చే సినిమాలో కూడా నటించనున్నట్టు సమాచారం. ఇవి పూర్తయ్యాకే తరుణ్ భాస్కర్ ప్రాజెక్ట్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే, తరుణ్ భాస్కర్ - నాగ చైతన్య కాంబోలో వచ్చే ఈ సినిమా చైతూ కెరీర్‌లో 25వ చిత్రంగా నిలిచే అవకాశముంది. ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow Us