SWAG Trailer
SWAG Trailer: రీసెంట్ గా ‘ఓం భీం బుష్’ సినిమతో అలరించిన యంగ్ హీరో శ్రీ విష్ణు మరో కామెడీ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హసిత్ గోలి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్ రూపొందిన 'స్వాగ్' ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన మూవీ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచుతోంది.
'స్వాగ్' ట్రైలర్
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్ టైనర్ గా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్ శ్రీ విష్ణు, రీతూ క్యారెక్టర్స్ మూవీ పై అంచులను మరింత పెంచుతున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటి మీరా జాాస్మిన్ మరో లీడ్ రోల్లో నటించారు. దక్ష నగార్కర్, గోప రాజు రమణ, ప్రదీప్, సునీల్, రవిబాబు, శరణ్య , గెటప్ శ్రీను, తదితరులు కీలక పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించారు.
ఆడ ladies, మగ gents, పిల్లలు మరియు పెద్దలందరూ చూసేయొచ్చు మన #అచ్చతెలుగుసినిమా! 😎#SWAGTheFilm is certified with 𝓤/𝓐 🤘#SWAGTrailer is Out Now - https://t.co/SpCjSZjsM3#SWAG Releasing Worldwide on October 4th! ❤🔥 #SWAGFromOct4th 🥳@sreevishnuoffl@riturv#MeeraJasmine… pic.twitter.com/2KLkjlN0JJ
— People Media Factory (@peoplemediafcy) October 1, 2024
Also Read: అవార్డుకే వన్నె తెచ్చిన నటుడు.. అసలు సిసలైన దాదా సాహెబ్ ఈ చక్రవర్తి