అవార్డుకే వన్నె తెచ్చిన నటుడు.. అసలు సిసలైన దాదా సాహెబ్ ఈ చక్రవర్తి బీజేపీ నేత, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఆయన ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. మిథున్ చక్రవర్తి 1976లో సినీ ప్రస్థానం మొదలు పెట్టారు. By Archana 01 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update Mithun Chakraborty షేర్ చేయండి 1/6 ప్రజలకు సేవ చేయాలనే స్పూర్తితో ఉద్యమకారుడిగా పోరుబాటలో అడుగుపెట్టిన మిథున్ చక్రవర్తి.. ఆయన తమ్ముడి మరణంతో తన ఆలోచనలు మార్చుకున్న ఆయన..1976లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 70 ఏళ్ళ సినీ జీవితంలో 370 పైగా సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. తన విశేష నటనా ప్రతిభతో హిందీనాట 'బెంగాల్ టైగర్' గా కీర్తిపొందారు. 2/6 మిథున్ చక్రవర్తి భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. అక్టోబర్ 8 2024న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ అవార్డును మిథున్ చక్రవర్తికి ప్రదానం చేయనున్నారు. ఆయన ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. 3/6 1976లో ‘మృగయ’ సినిమాతో తొలిసారి వెండితెర పై కనిపించిన మిథున్.. తొలి సినిమాతోనే నటుడిగా సత్తా చాటారు. ఈ సినిమాలో ఆయన అత్యుత్తమ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు వరించింది. ఆ తర్వాత ఆయన ఎక్కడా కూడా వెనుదిరిగి చూడలేదు. 1982లో విడుదలైన 'డిస్కో డాన్సర్' అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. 100 కోట్ల బిజినెస్ చేసిన తొలి సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. 4/6 1989లో ఒకే ఏడాదిలో అత్యధికంగా 19 సినిమాలు చేసిన నటుడిగా మిథున్ చక్రవర్తి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. 1980, 90' s లో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించారు. 5/6 70 ఏళ్ల సినీ కెరీర్ లో హిందీ, తమిళం, బెంగాలీ, తెలుగు సహా మొత్తం 370 సినిమాలు చేశారు. అయితే ఇందులో 180 సినిమాల వరకూ ప్లాపులే అయినప్పటికీ నటుడిగా ఆయన స్టార్ డమ్ ఏ మాత్రం తగ్గలేదు. 6/6 ఓ వైపు ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తూనే.. ప్రజల కోసం పాటుపడాలని భావించారు మిథున్. ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ఆయన 2014లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2016లో ఆ పదవికి రాజీనామా చేసిన ఆయన.. 2021లో భారతీయ జనతా పార్టీలో చేరారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి