Kanguva - Release Trailer
Kanguva Release Trailer: డైరెక్టర్ శివ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ 'కంగువ'. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, UV క్రియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విజువల్స్, బీజీఎమ్ హైలైట్
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. చీకటి కోన పులులన్నీ ఏకమై ఉరిమితే.. ఆకాశమే మెరుపై నేలను తాకితే.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో మొదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది. వెయ్యేళ్ళ కిందట జరిగిన కథను భవిష్యత్తుతో కనెక్ట్ చేసి చూపించారు. వెయ్యేళ్ళ క్రితం ఒక వీరుడు చేసిన ప్రతిజ్ఞ ఏంటి ? అతన్ని ఎవరు మోసం చేశారు? ఆ వీరుడు పునర్జన్మ ఎత్తాడా.. ? అతని మాటను నిలబెట్టింది ఎవరు..? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ లో సూర్య డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా దేవి మ్యూజిక్ హైలైట్ గా అనిపించింది.
Vaa..!#Kanguva all yours from Nov 14th#KanguvaTrailer2
— Suriya Sivakumar (@Suriya_offl) November 10, 2024
Tamil: https://t.co/lkjaYMBcZS
Hindi: https://t.co/3efp62ro4s
Telugu: https://t.co/Yd08uy1HZh
Malayalam: https://t.co/LALD5yIqzh
Kannada: https://t.co/qv1dUtCkZwpic.twitter.com/aGibjHZueR