Suriya 44
Shriya Saran: సినిమాల్లో సాధారణ పాటలతో పాటు ఐటం పాటలకు కూడా సెపరేట్ క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ కోసం హీరోయిన్లను ఎంపిక చేయడం కొత్త ట్రెండ్ గా మారింది. ఇప్పటికే పలు స్టార్ హీరోయిన్లు చేసిన ఐటమ్ నెంబర్స్ భారీ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ లో మరో స్టార్ హీరోయిన్ జాయిన్ అయ్యింది.
‘సూర్య 44’ శ్రియా స్టెప్పులు
అయితే గత కొన్ని రోజులుగా తమిళ అగ్రకథానాయకుడు సూర్య నటిస్తున్న 'సూర్య44' సినిమాలోని స్పెషల్ సాంగ్ లో అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ సూర్యతో కలిసి స్టెప్పులేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, తాజాగా శ్రియా దీని పై క్లారిటీ ఇస్తూ.. పాట గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తాను సూర్య సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడానని. ఇందులో సూర్యతో నేను వేసిన స్టెప్పులు ప్రేక్షకులలో ఫుల్ జోష్ నింపుతాయని... ఈ పాట కోసం గోవాలో ప్రత్యేకంగా ఒక సెట్ వేసి షూట్ చేసినట్లు తెలిపారు. ఈ స్పెషల్ పాటను డిసెంబర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘జిగర్ తండా డబుల్ ఎక్స్' ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే 90% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
#Suriya44 🥁💃#Suriya #Shriya #KarthikSubbaraj #PoojaHegde #Sana pic.twitter.com/MiLN1jPFMz
— Mr D Memes (@MrDMemes) August 28, 2024
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?