Jailer 2 Release Date: సోలో రిలీజ్ పై కన్నేసిన తలైవా.. జైలర్ 2 వచ్చేదప్పుడే..!

జైలర్ భారీ విజయంతో జైలర్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ చివరి దశలో ఉండగా, అన్ని భాషల్లో పోటీ లేకుండా సోలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 2026లో విడుదల చేసే అవకాశం ఉంది. 1000 కోట్ల క్లబ్ లక్ష్యంగా టీమ్ ముందుకు సాగుతోంది.

New Update
Jailer 2 Release Date

Jailer 2 Release Date

Jailer 2 Release Date: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘జైలర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ హిట్ అయింది. ఈ విజయంతో ఇప్పుడు ‘జైలర్ 2’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నెలలోనే మొత్తం చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. అయితే రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కారణం ఏమిటంటే, ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఎలాంటి పోటీ లేకుండా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉన్నందున సోలో రిలీజ్ ఉత్తమమని భావిస్తున్నారు.

మొదట జూన్‌లో విడుదల చేసే ఆలోచన ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆగస్టు నెలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొదటి భాగం 2023 ఆగస్టులో విడుదలై పెద్ద విజయం సాధించింది. అందుకే అదే నెలలో సీక్వెల్‌ను కూడా రిలీజ్ చేస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. 2026 ఆగస్టు 12 లేదా 14న, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఈ పార్ట్ లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తిరిగి కనిపించనున్నారని చెబుతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్‌లో ఉంటారనే ప్రచారం సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. అనిరుధ్ సంగీతం, రజినీ స్టైల్ కలిసి మరోసారి థియేటర్లను కదిలిస్తాయని అభిమానులు భావిస్తున్నారు.

ఇక కోలీవుడ్‌లో 1000 కోట్ల క్లబ్‌లో చేరే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మైలురాయిని చేరుకునే శక్తి జైలర్ 2కు ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు