/rtv/media/media_files/ananya-pandey-1.jpg)
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం హిందీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా దూసుకెళ్తోంది. ఇటీవలే అక్షయ్ కుమార్ సరసన 'ఖేల్ ఖేల్ మే' సినిమాతో అలరించిన అనన్య.. 'CTRL' అంటూ మరో థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ అక్టోబర్ 4న నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. Image Credits: Ananya Panday/ Instagram
/rtv/media/media_files/ananya-pandey-3.jpg)
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య సినిమాల్లో ఐటం సాంగ్స్ చేయడం పై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఐటమ్ సాంగ్స్ లో చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. Image Credits: Ananya Panday/ Instagram
/rtv/media/media_files/ananya-pandey-6.jpg)
అలాగే అనన్య మాట్లాడుతూ.. కొందరు కథకు సంబంధం లేకుండా, కథ డిమాండ్ చేయకపోయినా అనవసరంగా ఐటమ్ సాంగ్స్ పెడుతుంటారని. అలాంటి వాటిలో తాను నటించడానికి ఇష్టపడనని చెప్పింది. Image Credits: Ananya Panday/ Instagram
/rtv/media/media_files/ananya-pandey-5.jpg)
ఒకవేళ తాను ఐటమ్ సాంగ్స్ చేయాల్సి వస్తే.. అది సినిమా కథకు డిమాండ్ చేయాలని.. అలాంటి పాట వస్తే తప్పకుండా ఐటమ్ చేస్తానని తెలిపింది అనన్య. Image Credits: Ananya Panday/ Instagram
/rtv/media/media_files/ananya-pandey-2.jpg)
హిందీలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, కామెడీ పతి పత్నీ ఔర్ వో సినిమాలు అనన్యకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. బాలీవుడ్ లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనన్య.. విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. Image Credits: Ananya Panday/ Instagram