Jatadhara Trailer: ‘జటాధర’ రిలీజ్ ట్రైలర్ దుమ్మురేపిందిగా..

సుధీర్ బాబు నటించిన ‘జటాధర’ రిలీజ్ ట్రైలర్ దుమ్మురేపింది. గోస్ట్ హంటర్‌గా సుధీర్ బాబు, ధన పిశాచి పాత్రలో సోనాక్షి సిన్హా అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఈ కథ, పవర్‌ఫుల్ విజువల్స్‌ తో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

New Update
Jatadhara Trailer

Jatadhara Trailer

Jatadhara Trailer: సుధీర్ బాబు(Sudheer Babu) నటించిన ‘జటాధర’ చిత్రం నుండి తాజాగా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ముందుగా వచ్చిన టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో, మేకర్స్ నవంబర్ 7న థియేట్రికల్ రిలీజ్‌కు రెండు రోజుల ముందు ఈ రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ మొదటి నుంచే ఉత్కంఠగా సాగుతుంది. ఇందులో సుధీర్ బాబు పోషించిన హీరో ఒక గోస్ట్ హంటర్ పాత్రలో కనిపిస్తాడు. అతని లక్ష్యం  ‘ధన పిశాచి’ అనే శక్తివంతమైన దెయ్యాన్ని అడ్డుకోవడం. దాని వల్ల ప్రపంచానికి కలిగే నాశనాన్ని ఆపడానికి అతను తన ప్రాణాన్నే త్యాగం చేయాలనే నిర్ణయం తీసుకుంటాడు. ఆ విధ్వంసం నియంత్రణ లేకుండా పోయినప్పుడు, సమతుల్యతను కాపాడటానికి స్వయంగా లార్డ్ శివుడు అవతరిస్తాడు.

ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, మ్యూజిక్, ఎఫెక్ట్స్ అన్నీ బాగున్నాయి. ప్రేక్షకులలో ఒక స్పిరిట్యువల్ ఎనర్జీని రేకెత్తించేలా ఈ ట్రైలర్ కనిపిస్తుంది. సుధీర్ బాబు గోస్ట్ హంటర్ పాత్రను అద్భుతంగా ప్రదర్శించాడు. యాక్షన్, ఎమోషన్ రెండింటినీ బాగా చేసారు. 

అదేవిధంగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా(Sonakshi Sinha), ధన పిశాచి పాత్రలో భయపెట్టేలా నటించింది. ఆమె లుక్స్, నటన ట్రైలర్‌కి మరింత బలాన్ని ఇచ్చాయి. ఈ సినిమాకు దర్శకత్వం వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ కలిసి వహించగా, ప్రముఖ బ్యానర్లైన జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా ఎస్ కే జీ ఎంటర్టైన్‌మెంట్ సంస్థలు నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి.

మొత్తం ట్రైలర్ చూస్తే ప్రతి సీన్‌లోనూ విజువల్స్ పవర్‌ఫుల్‌గా ఉండగా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్‌లో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.

‘జటాధర’ సినిమా ప్రేక్షకులకు ఒక స్పిరిట్యువల్ థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వబోతోందని ఈ రిలీజ్ ట్రైలర్‌తోనే స్పష్టమైంది. నవంబర్ 7న ఈ చిత్రం విడుదల కానుండగా, అభిమానులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు