టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా తనకంటూ సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీను వైట్ల గురించి అందరికీ తెలిసిందే. కథ ఎలాంటిదైనా దాన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ వేలో చెప్పడం ఆయన స్టైల్. అందుకే ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన డైరెక్టర్ చేసిన వెంకీ, దుబాయ్ శీను, ఢీ, కింగ్, రెడీ, దూకుడు, బాద్ షా లాంటి సినిమాలు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అయితే గత కొన్నేళ్లుగా ఈ దర్శకుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఆ మధ్య 'అమర్ అక్బర్ ఆంటోని' అనే సినిమా చేసినా.. అది అట్టర్ ప్లాప్ అయింది. చాలా కాలం తర్వాత విష్ణు మంచు తో కలిసి సినిమా చేస్తున్న అని అనౌన్స్ చేశాడు. కానీ ఈ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఇప్పుడు యాక్షన్ హీరో గోపీచంద్ తో 'విశ్వం' సినిమా చేస్తున్నాడు.
Also Read : సినిమా ప్లాప్ అయితే హీరోయిన్నే తిడతారు.. సౌత్ ఇండస్ట్రీపై 'రాజా సాబ్' బ్యూటీ కామెంట్స్
సుమారు ఆరేళ్ళ తర్వాత ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు ఈ డైరెక్టర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల.. తానూ ఇన్నేళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకోవడానికి గల కారణాలు వెల్లడించాడు.
అందుకే ఈ గ్యాప్..
" ఈ మధ్య ప్రేక్షకులు కొత్త కథలను కోరుకుంటున్నారు. నా మూవీ మేకింగ్ స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కాకపోతే, థీమ్‌లు రిపీట్ అవుతున్నాయని వారు ఫీలవుతున్నారు. అందుకే గ్యాప్ తీసుకుని వర్క్ చేశా. సరికొత్త థీమ్‌లోకి నా ఎంటర్‌టైన్‌మెంట్‌ని అనుసంధానం చేసి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యా. అది చిన్న విషయం కాదు. అందుకే టైమ్ తీసుకుని ‘విశ్వం’ తెరకెక్కించా. ఈ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా ఇది.." అని చెప్పుకొచ్చాడు.