/rtv/media/media_files/2025/07/14/sreeleela-pose-with-cart-pic-six-2025-07-14-13-01-39.jpg)
అయితే వరుస అవకాశాలు వచ్చినప్పటికీ లక్ మాత్రం కలిసి రావడం లేదు. ఆమె ఖాతాలో వరుసగా ఫ్లాపులు పడుతున్నాయని టాక్. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాల్లో 'భగవంత్ కేసరి' తప్పా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచాయి.
/rtv/media/media_files/2025/01/12/sreeleela-pics.jpg)
ఇటీవల విడుదలైన 'జూనియర్' సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ .. రెండో రోజు పూర్తిగా చల్లబడింది.
/rtv/media/media_files/2025/07/14/sreeleela-pose-with-cart-pic-one-2025-07-14-13-01-40.jpg)
ఇక 'హరిహర వీరమల్లు' సినిమా రాకతో 'జూనియర్' దాదాపుగా థియేటర్ల నుంచి వెళ్లిపోయిందని చెబుతున్నారు. దీంతో ఈ సినిమా కూడా శ్రీలీల ఫ్లాప్ లిస్ట్‌లో చేరిందని టాక్ .
/rtv/media/media_files/2025/03/26/sreeleela-blue-saree-looks-691042.jpg)
జూనియర్' సినిమాకు ముందు కూడా శ్రీలీల నటించిన 'స్కంద', 'ఆదికేశవ', 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్', 'రాబిన్ హుడ్' వంటి సినిమాలు ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.
/rtv/media/media_files/2025/01/22/sreeleela-blue-shirt.jpg)
శ్రీలీల పాత్రలకు సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యత ఉండటం లేదని.. కేవలం గ్లామర్, డాన్స్ కోసమే అన్నట్లుగా కనిపిస్తోందని నెటిజన్ల అభిప్రాయం. 'జూనియర్' సినిమాలో ఆమె పాత్ర కేవలం పాటలకే పరిమితమైందని, సెకండాఫ్‌లో ఒక పాటలో తప్ప ఆమె కనిపించలేదని టాక్.
/rtv/media/media_files/2024/11/21/sreeleela112345.jpg)
ప్రస్తుతం శ్రీలీల పవన్ కళ్యాణ్ 'ఓజీ' తో పాటు పలు హిందీ సినిమాల్లో నటిస్తోంది.
/rtv/media/media_files/2025/01/22/sreeleela-looks-in-blue-shirt.jpg)
'ఓజీ ' సినిమాతోనైనా ఈ బ్యూటీ ప్లాప్ స్ట్రీక్ బ్రేక్ అవుతుందా? అని అనుకుంటున్నారు నెటిజన్లు