Barrelakka Sirisha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫుల్ ఫేమస్ అయ్యింది. అయితే మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈమె పై ట్రోలింగ్ మొదలు పెట్టారు నెటిజన్లు. ఎన్నికల సమయంలో చచ్చే వరకు నిరుద్యోగుల కోసం పోరాడుతానని ఎంతో మంది యువతను తన వైపు తిరిగేలా చేసింది. ఆమెను నమ్మిన యువత తన వెంట నడిచారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కూడా పలువురు బర్రెలక్కకు భారీగా ఆర్థిక సాయం చేశారు.
Also Read: BiggBoss ప్రియాంక సింగ్ ఇంట విషాదం.. తండ్రి చనిపోయారని ఎమోషనల్ పోస్ట్!
భర్తతో రీల్స్..
అలా ఎన్నికల సమయంలో చచ్చే వరకు నిరుద్యోగుల కోసం పోరాడుతానని చెప్పిన బర్రెలక్క .. ఇప్పుడు గ్రూప్-1పై ఇంత వివాదం జరుగుతుంటే కాస్త కూడా పట్టనట్లుగా భర్తతో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. దీంతో తనను నమ్మి తన వెంట నడిచిన ఎంతో మంది యువతను బర్రెలక్క మోసం చేసిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ''ఎన్నికల ముందు ఉన్నంత ఊపు ఎలెక్షన్ తరువాత లేదు'' ఇలాంటి వాళ్ళను ఇంకోసారి నమ్మలేము.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గతంలో బర్రెలక్క నిరుద్యోగులకు మద్దతుగా టీజీపీఎస్‌సీ (TGSPSC) కార్యాలయం ముందు దర్నాకు కూడా దిగింది. 'సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయొద్దు’ అంటూ నినాదాలు చేసింది. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వాలని, నిరుద్యోగులపట్ల నిర్లక్ష్యం వహరించవద్దని ఆమె డిమాండ్ చేసింది.
Also Read: Sarfaraz Khan : తండ్రైన ఇండియన్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్.. ఇన్స్టాలో పోస్ట్!
Also Read: BIG BREAKING: బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వకు గుండెపోటు !