/rtv/media/media_files/2025/10/01/madharaasi-ott-2025-10-01-11-02-24.jpg)
Madharaasi OTT
Madharaasi OTT: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan) ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ "మదరాసి" ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలై మంచి బజ్ క్రియేట్ చేసింది.
థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్
సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ తక్కించుకుంది. తమిళనాడులో మాత్రం ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అది అంతగా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ, సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.
స్టార్ కాస్టింగ్..
ఈ సినిమాలో హీరోగా శివకార్తికేయన్ మాస్ లుక్‌లో కనిపించి అభిమానులను అలరించాడు. ఆయనకు జోడిగా కాంతారా చాప్టర్ 1 ఫేమ్ రుక్మిణి వసంత్ నటించారు. ఇందులో బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జామ్వాల్ విలన్‌గా కనిపించడం సినిమాకు స్పెషల్ హైలైట్ అయ్యింది.
వీళ్ల ముగ్గురి మధ్య జరిగే డ్రామా, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించాయి. కానీ, కథనం ఓవరాల్‌గా కొన్ని చోట్ల బలహీనంగా అనిపించింది అని టాక్.
అనిరుధ్ మ్యూజిక్‌తో ఫుల్ ఎనర్జీ
ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు మంచి స్పీడ్ ఇచ్చాయి. ప్రత్యేకించి యాక్షన్ సీన్స్‌లో అనిరుధ్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు.
ఓటీటీలో మల్టీ లాంగ్వేజ్ రిలీజ్
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో "మదరాసి" సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంది. థియేటర్లకు వెళ్లి చూడలేకపోయినవారు ఇప్పుడు ఇంట్లోనే ఈ యాక్షన్ డ్రామాను ఆస్వాదించవచ్చు.
ఓటీటీ రెస్పాన్స్..
సినిమా థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా, ఓటీటీలో మాత్రం ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మంచి యాక్షన్, బిగ్ స్క్రీన్ ఫీలింగ్ ఇంట్లోనూ రావాలంటే కంటెంట్ స్ట్రాంగ్ ఉండాలి. అది "మదరాసి"లో ఎంతవరకూ ఉన్నదో, ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో తెలుస్తుంది.