/rtv/media/media_files/2025/12/14/sister-midnight-2025-12-14-09-49-48.jpg)
Sister Midnight
Sister Midnight: తెలుగులో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ‘సిస్టర్ మిడ్‌నైట్’ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. రాధికా ఆప్టే(Radhika Apte) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బ్లాక్ కామెడీ థ్రిల్లర్ తరహాలో రూపొందింది. కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిగి ఉండటంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.
ఈ సినిమా తెలుగులో డిసెంబర్ 12, 2025 నుంచి ఆడియన్స్ కోసం అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్‌తో ఇప్పటికే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాకు ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ డబ్బింగ్ కూడా యాడ్ చేశారు.
‘సిస్టర్ మిడ్‌నైట్’ మే 20, 2025న థియేటర్లలో విడుదలయ్యింది, కానీ థియేటర్లలో అంచనాలకు తగిన ఫలితం రాలేదు. జూన్ 17న మొదట హిందీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు ఆరు నెలల తర్వాత తెలుగు ప్రేక్షకులకూ చేరింది.
కరణ్ కందారి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో రాధికా ఆప్టే, అశోక్ పాఠక్, ఛాయా కదమ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
కథ విషయానికొస్తే.. గోపాల్ (అశోక్ పాఠక్), ఉమ (రాధికా ఆప్టే) చుట్టూ నడుస్తుంది. వేర్వేరు గ్రామాల వారు అయిన వారు వివాహం చేసుకుని ముంబైలో చిన్న ఇంట్లో ఉంటారు. ఉమకు ఇంటి పనులు, వంట పనులు చేయడం ఇష్టం లేదు. ఆమె కోరికలు తీరకపోవడం, భర్త వల్ల మైండ్ సెట్ మారిపోతుంది. ఈ క్రమంలో అనుకోని పరిస్థితుల్లో జంతువులను చంపుతుంది, భర్తను హత్య చేస్తుంది శవాన్ని ఇంట్లోనే ఉంచుతుంది.
ఈ సినిమా మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లింగ్, బ్లాక్ కామెడీ అంశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. భర్తను ఎందుకు చంపింది? తర్వాత ఏమయ్యింది? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం ‘సిస్టర్ మిడ్‌నైట్’ చూడాలి.
Follow Us