SIIMA Awards 2025: ''మేడం సార్.. మేడం అంతే''..  అవార్డుతో పాటు మీనాక్షి అందాల రచ్చ!

సైమా వేడుకల్లో మీనాక్షి చౌదరీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సైమా ఈవెంట్ కోసం ఈ బ్యూటీ ధరించిన డ్రెస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. డిజైనర్ బాడీ కాన్ గౌన్ లో మీనాక్షి స్టన్నింగ్ లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.

author-image
By Archana
New Update
Meenakshi Chowdary

Meenakshi Chowdary

SIIMA Awards 2025: సైమా అవార్డ్స్ 2025 ఉత్సవం దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. 2024లో సౌత్ ఇండస్ట్రీ నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచిన  నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్రాలకు గానూ  సైమా అవార్డ్స్ అందించారు. ఈ మేరకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం పరిశ్రమకు చెందిన నటీనటులు అవార్డు వేడుకలో సందడి చేశారు. తెలుగు నుంచి పుష్ప 2, కల్కి చిత్రాలకు అవార్డుల పంట పడింది. ' కల్కి' ఉత్తమ చిత్రంగా  అవార్డు సొంతం చేసుకోగా,  పుష్ప 2 సినిమాకు గానూ  అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా, దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డులు అందుకున్నారు. 

స్పెషల్ అట్రాక్షన్ గా మీనాక్షి 

అలాగే తెలుగు ఇండస్ట్రీ నుంచి మీనాక్షి చౌదరీ ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడంతో పాటు సైమా వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సైమా ఈవెంట్ కోసం ఈ బ్యూటీ ధరించిన డ్రెస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. డిజైనర్ బాడీ కాన్ గౌన్ లో మీనాక్షి స్టన్నింగ్ లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ డ్రెస్సులో ఆమె ఎద అందాలు చూపిస్తూ చాలా గ్లామరస్‌ అవతార్ లో రెచ్చిపోయింది. ఆకర్షణీయమైన ఫ్యాషన్ సెన్స్, స్టైలింగ్ తో  రెడ్ కార్పెట్ పై మెరిసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇవి చూసిన నెటిజన్లు స్టన్నింగ్, హాట్ అంటూ ఆమె అందాలను పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఓ నెటిజన్ ''మేడం సార్.. మేడం అంతే''.. అంటూ ఫైర్ ఈమోజీస్ తో మీనాక్షి ఫొటోలకు రిప్లై పెట్టాడు.

లక్కీ భాస్కర్ చిత్రానికి గానూ మీనాక్షి ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ప్రస్తుతం సమాజంలో డబ్బు అవసరం మనిషిని ఎలా మార్చగలదు అనే అంశంతో ఒక సోషల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మలయాళ హీరో దుల్కర్ లీడ్ రోల్లో నటించగా.. హీరో వైఫ్ పాత్రలో  మీనాక్షి నటించింది. 

Advertisment
తాజా కథనాలు