Cheekatilo: శోభిత ధూళిపాళ్ల ‘చీకటిలో’.. ఎలా ఉందంటే.?

శోభిత ధూళిపాళ్ల నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. న్యూస్ యాంకర్ సంధ్య జీవితాన్ని కుదిపేసే హత్య కేసు, రాత్రివేళ జరిగే నేరాలపై ఆమె చేసే విచారణే కథ. బలమైన కథ, శోభిత నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

New Update
Cheekatilo

Cheekatilo

Cheekatilo: నటి శోభిత ధూళిపాళ్ల(Shobhita Dhulipala) ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘చీకటిలో’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో శోభిత తొలిసారి తెలుగు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ట్రైలర్‌తోనే మంచి ఆసక్తి పెంచిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ విడుదలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 


ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ, కృష్ణ చైతన్య, శ్రీనివాస్ వడ్లమాని, ఈషా చావ్లా, ఝాన్సీ, సురేష్, రవీంద్ర విజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

కథ విషయానికి వస్తే, శోభిత సంధ్య అనే న్యూస్ యాంకర్ పాత్రలో కనిపిస్తుంది. ఆమె క్రైమ్‌ ఆధారిత టీవీ షో నిర్వహిస్తుంది. ఆమెతో కలిసి పనిచేసే టీనేజ్ ఇంటర్న్ బాబీ (అదితి మైకల్)పై జరిగిన హింసాత్మక హత్య సంధ్య జీవితాన్ని కుదిపేస్తుంది. బాబీ ఎన్నోసార్లు ట్రూ క్రైమ్ పోడ్కాస్ట్ ప్రారంభించమని కోరినా, సంధ్య అంగీకరించదు. కానీ బాబీ మరణమే ఆమెను ఆ దిశగా నడిపిస్తుంది.

పోడ్కాస్ట్ మొదటి ఎపిసోడ్‌లో బాబీ హత్య వెనుక నిజం ఏంటో తెలుసుకోవడానికి సంధ్య లోతైన విచారణ మొదలుపెడుతుంది. దర్యాప్తులో, రాత్రి వేళ మహిళలపై జరుగుతున్న వరుస దాడుల గురించి భయంకరమైన నిజాలు బయటపడతాయి. దాడి చేసిన వ్యక్తి బాధితుల వద్ద పూలు, చిహ్నాలు వదిలి వెళ్లడం ప్రత్యేకతగా కనిపిస్తుంది.

బాబీ హత్యలో కూడా ఇదే విధమైన సంకేతాలు కనిపించడంతో, ఒకే వ్యక్తి ఈ నేరాలకు కారణమా అనే అనుమానం బలపడుతుంది. అన్ని ఘటనలు రాత్రిపూట జరగడం వల్ల, ఈ కథకు ‘చీకటిలో’ అనే పేరు పెట్టారు.

బలమైన కథ, వాస్తవికంగా చూపించిన సన్నివేశాలు, ముఖ్యంగా శోభిత ధూళిపాళ్ల నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. కొన్ని సహాయక పాత్రలు పెద్దగా లోతుగా లేకపోయినా, మొత్తం మీద ఇది ఆసక్తికరంగా సాగుతుంది. నేర కథలు, నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలు ఇష్టపడే వారికి ‘చీకటిలో’ మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది.

Advertisment
తాజా కథనాలు