Bhairathi Ranagal Trailer
Bhairathi Ranagal Trailer: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ 'భైరతి రణగల్'. నవంబర్ 15న విడుదలైన ఈ చిత్రం కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది. సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తుండడంతో.. తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. తెలుగులో ఈ మూవీని నవంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
భైరతి రణగల్ ట్రైలర్
ట్రైలర్ లో.. ''జనాల కోసం నేను ఎవరినైనా పోగొట్టుకుంటాను కానీ జనాలను కాదు'' అంటూ శివరాజ్ కుమార్ చెప్పే డైలాగ్స్ హైలైట్ గా అనిపించాయి. రోనాపురా గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. న్యాయం కోసం పోరాడే ఓ యువకుడు చట్టం విఫలమైనప్పుడు న్యాయాన్ని గెలిపించడానికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు..? న్యాయవాదిగా ఉన్న అతను కర్ణాటకలో మైనింగ్-మాఫియా కింగ్ గా ఎలా మారాడు ..? అనే అంశాలు ట్రైలర్ లో ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమాపై క్యూరియాసిటీనీ పెంచుతున్నాయి. 2017లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన 'మఫ్తీ' కి ప్రీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.
శివరాజ్ కుమార్ భార్య గీత నిర్మించిన ఈ చిత్రంలో రాహుల్ బోస్, రుక్మిణి వసంత్, దేవరాజ్, ఛాయా సింగ్, మధు గురుస్వామి, వశిష్ట ఎన్. సింహా, షబీర్ కల్లరక్కల్, మరియు బాబు హిరన్నయ్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Thank you so much @NameisNani ❤️
— Geetha Pictures (@GeethaPictures) November 24, 2024
Wishing Great success for your future projects too!!
All the best #MyraCreations for the Telugu Distribution of Bhairathi Ranagal!! #BhairathiRanagal in Cinemas from November 29 https://t.co/5Gs1unm3mv
Also Read : ఎట్టకేలకు బయటపడ్డ విజయ్ - రష్మిక సీక్రెట్ రిలేషన్.. ఒక్క ఫొటోతో క్లారిటీ