Sankranti Movie: 'సంక్రాంతి' సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరో .. ఎవరో తెలుసా?

హీరో వెంకటేష్ నటించిన ఫ్యామిలీ చిత్రాల్లో చాలా మందికి ఫేవరేట్ చిత్రం 'సంక్రాంతి'. ప్రతి సంక్రాంతికి టీవీల్లో ఈ సినిమాను ఖచ్చితంగా చూస్తుంటారు ప్రేక్షకులు. వెంకటేష్,  శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.

New Update

Sankranti Movie: హీరో వెంకటేష్ నటించిన ఫ్యామిలీ చిత్రాల్లో చాలా మందికి ఫేవరేట్ చిత్రం 'సంక్రాంతి'. ప్రతి సంక్రాంతికి టీవీల్లో ఈ సినిమాను ఖచ్చితంగా చూస్తుంటారు ప్రేక్షకులు. వెంకటేష్,  శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో  అన్నదమ్ములు అనుబంధం, ఉమ్మడి కుటుంబాల విలువలను చక్కగా చూపించారు. ముఖ్యంగా ఇందులో శ్రీకాంత్, వెంకటేష్ మధ్య బాండింగ్, ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో హీరో వెంకటేష్ కంటే కూడా తమ్ముడిగా నటించిన శ్రీకాంత్ కి  మంచి పేరు వచ్చింది. మరి శ్రీకాంత్ కి ఇంత పేరు తెచ్చి పెట్టిన ఈ పాత్ర కోసం మొదట వేరే హీరోను అనుకున్నారట డైరెక్టర్ ముప్పలనేని  శివ. 

శ్రీకాంత్ పాత్రకు మరో హీరో 

అయితే సినిమా స్క్రిప్టింగ్ దశలో ఉన్నప్పుడు శ్రీకాంత్ నటించిన విష్ణు పాత్రకు వడ్డే నవీన్ ని అనుకున్నారట. పేపర్ పై కథ రాసేటప్పుడు కూడా విష్ణు పాత్రకు వడ్డే నవీన్ పేరునే పెట్టుకున్నారట. కానీ, ఆ తర్వాత విష్ణు పాత్రకు శ్రీకాంత్ అయితే బాగుంటుందని భావించారట డైరెక్టర్. దీంతో శ్రీకాంత్ కి కథ వినిపించగా.. మొదట ఈ పాత్రను చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. అయితే అదే సమయంలో శ్రీకాంత్ బాపు దర్శకత్వంలో స్నేహతో కలిసి 'రాధాగోపాలం' చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి మూవీలో స్నేహ.. శ్రీకాంత్ పాత్రకి వదినగా నటిస్తోంది. దీంతో ఆడియన్స్ ఒప్పుకుంటారా? లేదా? అనే ఆలోచనలో పడ్డారట శ్రీకాంత్. కానీ, డైరెక్టర్ శివ మాత్రం శ్రీకాంతే చేయాలని పట్టుదలగా ఉన్నారట. ఈ పాత్ర మీకు మంచి పేరు తెస్తుందని ఒప్పించే ప్రయత్నం చేశారట. ఇక చివరికి నిర్మాత ఆర్. బి. చౌదరి బలవంతం చేయడంతో సినిమాలో నటించేందుకు అంగీకరించారట శ్రీకాంత్. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. వెంకటేష్ తమ్ముడిగా విష్ణు పాత్రలో శ్రీకాంత్ నటన, ఎమోషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో శివ బాలాజీ,  శర్వానంద్, వెంకటేష్, శ్రీకాంత్ అన్నదమ్ములుగా నటించారు. వీరికి తల్లిదండ్రులుగా శారద, చంద్ర మోహన్ నటించారు. అలాగే హీరోయిన్ స్నేహ, సంగీత, ఆర్థి అగర్వాల్,  ఫీమెల్ లీడ్స్ గా మెరిశారు. ఈ సినిమాలోని పాటలు కూడా అప్పట్లో పెద్ద హిట్స్ గా నిలిచాయి. 

ముఖ్యంగా "డోలీ డోలి", "ఎలా వచ్చెనమ్మా" వంటి పాటలు ఫుల్ పాపులర్ అయ్యాయి. అన్నదమ్ముల అనుబంధం కుటుంబ విలువలు వంటి అంశాలతో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచింది సంక్రాంతి.  ఈ సినిమా ప్రేక్షకులను  ఎంతలా ఆకట్టుకుందంటే.. ప్రతి సంక్రాంతి పండక్కి సంక్రాంతి సినిమా చూడాలి అనేంతగా. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. వెంకీ మామ ఫ్యామిలీ చిత్రాల్లో వన్ ఆఫ్ ది ఫేవరేట్ గా నిలిచింది . 

Also Read: Bads of Bollywood: షారుక్ ఖాన్ కొడుకు డైరెక్టర్ గా తొలి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Advertisment
తాజా కథనాలు