/rtv/media/media_files/2025/01/03/sqIqQvluDSaNcSBKiIXQ.jpg)
sakshi Photograph: (sakshi)
నటి, బిగ్ బాస్ 3 తమిళ మాజీ కంటెస్టెంట్ సాక్షి అగర్వాల్ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్‌ను 2025 జనవరి 02వ తేదీ గురువారం వివాహం చేసుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో వెల్లడించింది. గోవాలోని ఓ స్టార్ హోటల్‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది.ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు. కొంతమంది ఆత్మీయులు హాజరయ్యారు. మా చిన్ననాటి స్నేహం ఇప్పుడు జీవితకాల బంధంగా మారిందని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. నవనీత్‌ను పెళ్లి.. నా కలను నిజం చేసిందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు.
From childhood friends to soulmates 💍✨ Under the Goan skies, Navneet and I said ‘forever’ amidst love and waves 🌴❤️ 🥂 Here’s to a lifetime of love, laughter, and endless memories. 💍✨#NakshBegins#SakshiWedsNavneet#ChildhoodToForeverpic.twitter.com/XuSKHjZb2f
— Sakshi Agarwal (@ssakshiagarwal) January 3, 2025
సాక్షి అగర్వాల్ ఎవరు?
నైంటియల్‌కు చెందిన సాక్షి అగర్వాల్ చెన్నైలో పెరిగారు . సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఎంబీఏ చేసింది.ఇక అట్లీ డైరెక్షన్ లో వచ్చిన రాజా రాణి చిత్రంతో ఆమె సినీ జీవితం మొదలైంది. రజనీకాంత్ కాలా, అజిత్ విశ్వాసం, సుందర్ సి అరణ్మనై 3 మొదలైన సినిమాలలో నటించి ఆకట్టుకుంది సాక్షి. తమిళ బిగ్ బాస్ 3 సీజన్ తో సాక్షి అగర్వాల్ ఫేమస్ అయింది. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఘాటు ఫొటోషూట్స్ తో కూడా సాక్షి చాలా పాపులర్ అయింది.
Also Read : 'విశ్వంభర' టీమ్ లో మార్పులు.. మేకర్స్ నిర్ణయం వెనక రీజన్ ఇదేనా?