Mowgli Glimpse: సుమ కొడుకు కోసం రంగంలోకి నాని.. ‘మోగ్లీ’ గ్లింప్స్ చూశారా..?

స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల ‘మోగ్లీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా హీరో నాని వాయిస్ ఓవర్‌తో “ది వరల్డ్ ఆఫ్ మొగ్లీ” అనే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రం ఆగస్టు 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

New Update

Mowgli Glimpse: తొలిచిత్రంతోనే తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల, ఇప్పుడు తన తదుపరి సినిమా ‘మోగ్లీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘కలర్ ఫొటో’ ఫేం సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై మంచి ఎక్సపెక్టషన్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి సాక్షి మడోల్కర్ ఈ సినిమాతో తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది.

న్యాచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్..

షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడింది. తాజాగా హీరో నాని వాయిస్ ఓవర్‌తో రూపొందించిన “ది వరల్డ్ ఆఫ్ మొగ్లీ” గ్లింప్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. రిలీజ్ చేసిన గ్లింప్స్ చుస్తే ఒక ఫ్రెష్ ఫీల్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. న్యాచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ తో చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్ మొత్తానికి హైలైట్ గా నిలిచాయి. అయితే బండి సరోజ్ విలన్ గా నటిస్తుండడం విశేషం. ‘మోగ్లీ’ తో డైరెక్టర్ సందీప్ రాజ్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి. 

Advertisment
తాజా కథనాలు