/rtv/media/media_files/2025/11/10/rt76-2025-11-10-12-27-43.jpg)
RT76
RT76: మాస్ మహారాజా రవి తేజ(Ravi Teja) హీరోగా నటిస్తున్న RT76 సినిమా చుట్టూ మళ్లీ హల్‌చల్ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఈరోజు మధ్యాహ్నం 3:33 గంటలకు అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు చివరగా “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే టైటిల్ ఖరారు చేసారు.
RT76 Title Reveal
టైటిల్ రివీల్‌తో పాటు సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ (OTT), శాటిలైట్ (TV) హక్కులను ప్రముఖ మీడియా సంస్థ జీ గ్రూప్ (ZEE Group) సొంతం చేసుకుంది. సమాచారం ప్రకారం, జీ గ్రూప్ మంచి మొత్తంలో డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ZEE5 (Z5) ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కి వస్తుంది. అలాగే, ZEE తెలుగు, ZEE సినిమాలు చానళ్లలో ఈ సినిమాను టెలికాస్ట్ చేయనున్నారు.
ఈ చిత్రం సంక్రాంతి 2026లో థియేటర్లలో విడుదల కానుంది. థియేటర్ రన్ పూర్తయిన తర్వాత OTT, టీవీ ప్రీమియర్ తేదీలు అధికారికంగా ప్రకటించనున్నారు. సినిమాలో హీరోయిన్లుగా ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి నటిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని SLV సినిమాస్ నిర్మిస్తోంది.
సంగీతాన్ని భీమ్స్ సెసిరోలియో అందిస్తున్నారు. ఆయన ఇటీవల రవి తేజ సినిమాలకు ఇచ్చిన ఎనర్జీటిక్ మ్యూజిక్ మంచి హిట్ అవడంతో, ఈసారి కూడా ఆయన సంగీతంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్ కలయికగా ఉండబోతుందని టాక్. రవి తేజ కెరీర్‌లో మరో ఎంటర్‌టైనింగ్ ప్యాకేజ్‌గా ఈ సినిమా నిలవనుందని యూనిట్ చెబుతోంది.
“భర్త మహాశయులకు విజ్ఞప్తి” టైటిల్‌తో రవి తేజ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే టైటిల్‌పై భారీ ఆసక్తి నెలకొంది. థియేటర్లలో హంగామా చేయడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా తర్వాత, OTT, టీవీలో కూడా మంచి రికార్డులు సృష్టించనుంది. సంక్రాంతి పండుగకు రవి తేజ మాస్ ట్రీట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు!
Follow Us