విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో.. 'గర్ల్‌ఫ్రెండ్' టీజర్! చూశారా

రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్'. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో సాగిన ఈ ఎమోషనల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.

New Update

The Girlfriend Teaser:  నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వాటిలో ఒకటి  'ది గర్ల్ ఫ్రెండ్'. నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మేకర్స్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. 

'ది గర్ల్ ఫ్రెండ్' టీజర్ 

ఈ టీజర్ ను స్టార్ హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. న‌య‌నం న‌య‌నం క‌లిసే త‌రుణం.. ఎదనం పరుగై పెరిగే వేగం. నా క‌దిలే మ‌న‌సుని అడిగా సాయం. ఇక మీదట నువ్వే దానికి గమ్యం అంటూ విజయ్ డైలాగ్స్ తో టీజర్ ప్రారంభమవుతుంది. రష్మిక ప్రేమ.. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సమస్యలు వంటి  అంశాలతో సినిమా ఉండబోతున్నట్లు టీజర్ లో తెలుస్తోంది. ఇందులో రష్మిక బాయ్ ఫ్రెండ్ గా 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్  బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. 

 ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. శ్రీవల్లి పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.  ఈ సినిమాతో రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది.

Also Read: ఇదెక్కడి వింతరా బాబు.. బంగారు నగలతో పిల్లికి శ్రీమంతం.. మామూలుగా లేదుగా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు