Thamma: రష్మిక మళ్ళీ హిట్టు కొట్టిందా.. 'థామా' ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే?

రష్మిక మందన్నా- ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ హారర్ 'థామా' నేడు థియేటర్స్ విడుదలైంది. మొదటి షో నుంచే సినిమాకు మంచి మంచి టాక్ వినిపిస్తోంది.

New Update
thamma twitter review

thamma twitter review

Thamma:  రష్మిక మందన్నా- ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ హారర్ 'థామా' నేడు థియేటర్స్ విడుదలైంది. మొదటి షో నుంచే సినిమాకు మంచి మంచి టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియా రివ్యూవర్స్ , క్రిటిక్స్ కూడా సినిమాపై సానుకూలంగా స్పందిస్తున్నారు. సినిమా చూసిన వారంతా ఇదొక పూర్తి వినోదాత్మక చిత్రమని చెబుతున్నారు. కామెడీ, హారర్, రొమాన్స్ కలయికతో సినిమా అదిరిపోయిందని అంటున్నారు.  కథ చాలా కొత్తగా, ఊహించని మలుపులతో గ్రిప్పింగ్ గా ఉందని చెబుతున్నారు. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇదొక మంచి ఎంటర్ టైనర్ అని అంటున్నారు. సినిమాలో రష్మిక మందన్నా నటన ప్రత్యేకంగా ఆకట్టుకుందని కొనియాడుతున్నారు.

ఒక పురాతన కాలం నాటి కథకు ఆధునికతను జోడించి సినిమాను చక్కగా రూపొందించారని చెబుతున్నారు. రక్తం తాగే దెయ్యాలు వేంపైర్  కథా నేపథ్యంతో  ఈ సినిమా కథ సాగుతుంది.  హీరోయిన్ రష్మిక ఇందులో వేంపైర్ పాత్రలో నటించింది. సినిమాలో రష్మిక పాత్ర చాలా ఛాలెంజింగ్ గా కీలకంగా ఉందని.. మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్రను ఆమె ఎంచుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

తరుణ్ ఆదర్శ్ రివ్యూ 

పాపులర్ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కూడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.  మడోక్ ఫిల్మ్స్ మరోసారి మంచి సినిమాను అందించారని కొనియాడారు. హ్యూమర్, రొమాన్స్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపిన విజువల్ ఫీస్ట్ గా 'థామా' రూపొందించారు. సినిమా కథ చాలా భిన్నంగా.. ఎవరికి ఊహించని సన్నివేశాలతో ఆశ్చర్యపరుస్తుంది. దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ తన సత్తా చాటుకున్నారు. రష్మిక, ఆయుష్మాన్ తమ నటనతో సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లారు అంటూ రివ్యూ ఇచ్చారు. 

Also Read: Hebah Patel: హెబ్బా ఫోజులకు మతిపోతుంది! నడుమందాలతో కుర్రకారును ఫిదా చేస్తున్న బ్యూటీ !

Advertisment
తాజా కథనాలు