/rtv/media/media_files/BvDvllJaIXiNB8VrldAM.jpg)
/rtv/media/media_files/bKYpd2Mp7H54CoUSRqNv.jpg)
రష్మిక మందన్న పాపులారిటీ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇతర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది.
/rtv/media/media_files/1ET3SEJzefo29D32DqLZ.jpg)
ఛలో సినిమాతో ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి సినిమాతోనే అందం, అభినయంతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
/rtv/media/media_files/sWinKuE8c4D1Z0bTv9Kp.jpg)
వరుస సినిమాలతో దూసుకుపోయింది. నితిన్, నాని, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండతో సినిమాలు చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలన్నీ ఆమెకు అంతంత మాత్రమే పేరును తీసుకొచ్చాయి. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసిన పుష్ప సినిమా మాత్రం ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా అందించింది.
/rtv/media/media_files/Awag1gTcZyJm5gVPn1By.jpg)
ఈ సినిమాతోనే రష్మిక పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత హిందీలో యానిమల్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో నార్త్‌లో సైతం ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పుష్ప 2, యానిమల్ 2తో పాటు మరిన్ని చిత్రాలను లైన్లో పెట్టింది.
/rtv/media/media_files/oomsfN1DJAon5BWdqaV5.jpg)
ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రాకారుని మంత్ర ముగ్ధులను చేస్తుంది.
/rtv/media/media_files/LEzCDez1WlUlpSOn6EMW.jpg)
తాజాగా తన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. అందులో రష్మిక క్యూట్ స్మైల్‌తో కట్టిపడేసిది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.