Girl Friend Trailer: నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న- దీక్షిత్ శెట్టి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ విడుదలైంది. హీరో హీరోయిన్ల కాలేజ్ లవ్ స్టోరీ, రొమాన్స్, ఎమోషన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. "అన్ని లవ్ స్టోరీలు అద్భుత కథలు కావు. రియాలిటీలో కొన్ని మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి" అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ సినిమా ఒక సాధారణ ప్రేమకథ కాదని, చాలా లోతైన భావోద్వేగాలు కలిగి ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో దీక్షిత్ శెట్టి రష్మిక బాయ్ ఫ్రెండ్ గా నటించారు. నటి అనుఇమ్మాన్యుయేల్ కూడా మరో ఫీమేల్ లీడ్ గా నటించింది.
దీక్షిత్ శెట్టి- రష్మిక, అనుఇమ్మాన్యుయేల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హీరో దీక్షిత్ శెట్టి ఓవైపు రశ్మికను ప్రేమిస్తూనే.. మరోవైపు అనుఇమ్మాన్యుయేల్ తో కూడా లవ్ ఉండడం కాస్త సస్పెన్స్ కలిగించింది. దీక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమ ప్రయాణం, మధ్యలో వచ్చే సమస్యల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.
This one’s not your usual love story.. it’ll make you think. ❤️🔥#TheGirlfriend trailer out now..
— Rashmika Mandanna (@iamRashmika) October 25, 2025
In cinemas on November 7th ✨
🔗https://t.co/D5wKxMIBe0#TheGirlfriendOnNov7th@Dheekshiths@23_rahulr@HeshamAWmusic#AlluAravind#VidyaKoppineedi#PrashanthRVihari… pic.twitter.com/KAgxb1wnbp
నవంబర్ లో విడుదల
ట్రైలర్ లో సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం సన్నివేశాలను మరింత ఎమోషనల్‌గా మార్చింది. అలాగే ట్రైలర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా అనిపించింది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రేమను ఒక విభిన్న కోణంలో చూపించడానికి ప్రయత్నించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
'ది గర్ల్ ఫ్రెండ్' రష్మిక కెరీర్ లో ఒక మంచి ఫీమెల్ ఓరియెంటెడ్లేడీ ఓరియెంటెడ్ ఎమోషనల్ ప్రేమకథా చిత్రంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రం నవంబర్ 7న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సమర్పణలో విద్యా కొప్పినీడి & ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు.
Also Read: Baahubali Bookings: బాహుబలి: ది ఎపిక్ కు కళ్లు చెదిరేలా హైదరాబాద్ బుకింగ్స్..!
Follow Us