జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. అప్పటిదాకా జైల్లోనే!

జానీ మాస్టర్‌ కు మరో షాక్ తగిలింది. ఇటీవల ఆయన తనకు రెగ్యులర్ బెయిల్ కావాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు.. ఈనెల 14న తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది.

jani11
New Update

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అతని దగ్గర పనిచేసే మహిళా  అసిస్టెంట్ ను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. అత్యాచార కేసులో గత 15 రోజులుగా పోలీసుల కస్టడీలో చెంచల్ గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్.. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇటీవల పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే ఆయనకు మరో షాక్ తగిలింది. 

ఆయన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేస్తూ.. ఈనెల 14న తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది. ఇటీవల తనకు ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు వచ్చిందని, అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత సోమవారం రంగారెడ్డి జిల్లా పోక్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

Also Read : నాగ చైతన్య ఎక్స్ అకౌంట్ హ్యాక్

వాదనలు విన్న కోర్టు ఈ నెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కానీ జానీ మాస్టర్ అందుకోబోయే పురస్కారాన్ని రద్దు చేసినట్లు ఆయనకు తెలియడంతో తనకు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను వినియోగించుకోబోనని కోర్టులో మెమో దాఖలు చేశారు. వచ్చిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న జానీమాస్టర్.. తనకు రెగ్యులర్ బెయిల్ కావాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ క్రమంలోనే బెయిల్ పిటిషన్ తీర్పు ఈ నెల 14 కి వాయిదా పడింది.

లైంగిక వేధింపులతో జైలుకి..

జానీ మాస్టర్ దగ్గర పనిచేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్.. జానీ గత కొన్నాళ్లుగా తనను  లైంగికంగా వేధిస్తున్నాడని సెప్టెంబర్ 18న నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ మేరకు పోలీసులు జానీ పై IPC 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ ఆమె పై వేధింపులకు పాల్పడ్డాడని తెలియడంతో పోక్సో చట్టం కింద కూడా  కేసు పెట్టారు. 

 

#jani-master
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe