/rtv/media/media_files/2025/12/23/ramya-krishna-2025-12-23-12-05-03.jpg)
Ramya Krishna
Ramya Krishna: నటి రమ్యకృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో నీలాంబరి ఒకటి. రజనీకాంత్ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహ (తమిళంలో పడయప్ప) సినిమాలో ఆమె చేసిన ఈ పాత్రకు ఇప్పటికీ తగ్గని క్రేజ్ ఉంది. పవర్‌ఫుల్ నటనతో నీలాంబరి పాత్రను రమ్యకృష్ణ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు.
1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే కాదు, ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రజనీ కెరీర్‌లోనే ఇది ఒక పెద్ద బ్లాక్‌బస్టర్. తలైవా సినీ ప్రయాణానికి గుర్తుగా ఈ సినిమాను ఇటీవల థియేటర్లలో మళ్లీ విడుదల చేశారు. ఈ రీ రిలీజ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఇటీవల రమ్యకృష్ణ కూడా ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఆనందించారు. నీలాంబరి పాత్రలో తాను నటించిన సీన్లను పెద్ద తెరపై చూస్తూ మురిసిపోయారు. ముఖ్యంగా రజనీకాంత్‌తో ఆమె ఎదురుపడే ఒక పవర్‌ఫుల్ సీన్ చూసినప్పుడు ఆమె ఫుల్ ఖుషి అయ్యారు. ఆ క్షణాన్ని వీడియోగా తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
Padayappa Re Release
ఆ వీడియోకు “మొదటిసారి నరసింహ సినిమాను థియేటర్‌లో చూశాను” అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా నీలాంబరి పాత్ర గురించి మళ్లీ చర్చించుకుంటున్నారు.
సినిమాలో నీలాంబరి పాత్ర ప్రేమలో ఓటమి తర్వాత పగతో రగిలిపోయే మహిళగా చూపించారు. తన తండ్రి మరణానికి నరసింహ కారణమని భావించి, అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. చాలా ఏళ్ల తర్వాత నరసింహ, నీలాంబరి ఎదురుపడే సీన్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంది. ఆ సీన్‌లో డైలాగ్స్, నటన ఇప్పటికీ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.
ఈ ఐకానిక్ సీన్‌ను థియేటర్‌లో అభిమానులతో కలిసి రమ్యకృష్ణ ఆస్వాదించడం ప్రత్యేకంగా మారింది. నీలాంబరి పాత్ర ఎంత బలమైనదో మరోసారి అందరికీ గుర్తు చేసింది. ఈ రీ రిలీజ్‌తో నరసింహ సినిమా, నీలాంబరి పాత్ర మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
Follow Us