Ram Pothineni: దర్శకుడిగా మారుతున్న రామ్ పోతినేని.. మూవీ డిటెయిల్స్ ఇవిగో..!

హీరో రామ్ పోతినేని త్వరలో దర్శకుడిగా మారబోతున్నారు. జీ5 టాక్‌షోలో ఇది స్వయంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఆయన నటిస్తున్న "ఆంధ్రా కింగ్ తాలూకా" టీజర్‌లో రామ్ మాస్ డైలాగ్స్, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. అభిమానానికి కొత్త అర్థం చెప్పే సినిమా ఇది.

New Update
Ram Pothineni

Ram Pothineni

Ram Pothineni: యంగ్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు సినిమాల్లో కొత్త చాప్టర్‌ ప్రారంభించబోతున్నారు. నటుడిగా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న రామ్, తాజాగా జీ5 టాక్‌షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ కార్యక్రమంలో పాల్గొని తన ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పాడు.

Ram Pothineni Directorial Debut

తన డైరెక్టోరియల్ డెబ్యూట్ గురించి మాట్లాడుతూ, రామ్ ‘‘నేనే కథ రాస్తున్నాను. త్వరలోనే దర్శకత్వం వహించబోతున్నాను’’ అని ప్రకటించాడు. నటుడిగా కొనసాగుతూ దర్శకుడిగా కూడా ప్రయాణం చేయడం రామ్‌కు ఓ పెద్ద మైలురాయిగా మారనుంది.

ఇదిలా ఉండగా, రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌లో రామ్ ఎనర్జీ, మాస్ డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రామ్, హీరో ఉపేంద్రకు వీరాభిమాని పాత్రలో కనిపించనున్నాడు.

ఒక అభిమాని తన ఇష్టమైన హీరో కోసం ఎంత దూరమైనా వెళ్తాడని, ఏం చేయడానికైనా వెనుకాడడు అనే పాయింట్‌ను బేస్‌గా తీసుకుని రూపొందించినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో రామ్ చెప్పే డైలాగ్స్‌తో పాటు, యాక్షన్ సీన్లు కూడా మాస్ ఆడియన్స్‌కి బాగా నచ్చేలా ఉన్నాయి.

టీజర్ హైలైట్స్.. (Andhra King Taluka Teaser)

"ఫ్యాన్... ఫ్యాన్ అని గుడ్డలు చింపేసుకోవడమే కానీ... నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకి తెలియదు. ఏం బతుకులురా మీవీ..."

ఈ డైలాగ్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ కూడా టీజర్‌లో ఆకట్టుకుంది. టీజర్‌లో ఎమోషన్స్, డ్రామా, యాక్షన్ అన్నీ మిక్స్ చేసి మాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేశారు మూవీ టీమ్.

ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకత్వం మహేష్ బాబు పి చేపట్టగా, ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఓవర్‌ఆల్‌గా, రామ్ డైరెక్షన్‌ వైపు అడుగుపెడుతుండటంతో పాటు, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాతో మళ్లీ మాస్‌లో రీచౌట్ అవుతున్నాడు. త్వరలో సినిమా మీద మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు