/rtv/media/media_files/2025/05/19/0Y96U1QLoTNFuLn8r0bh.jpg)
Ram Charan Peddi
Ram Charan Peddi: పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న రామ్ చరణ్ తాజా చిత్రం "పెద్ది" గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు సరసగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి పోస్టర్ నుంచే ఈ సినిమా పాన్ ఇండియా ఆడియన్స్ లో కూడా ఆసక్తిని రేకెత్తించింది.
ఇటీవలే రామ్ చరణ్ తన విదేశీ పర్యటనను పూర్తి చేసుకొని, తిరిగి షూటింగ్‌లో బిజీగా మారారు. అయితే, చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు, సహచరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సినిమా టీమ్ నుంచీ కూడా బర్త్‌డే విషెస్ వెల్లువెత్తాయి.
మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్
ఈ స్పెషల్ మొమెంట్ ని రామ్ చరణ్ ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ, షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ కొట్టబోయే నా ప్రొడ్యూసర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!” అంటూ చరణ్ తనదైన శైలిలో పోస్టు చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది.
త్వరలో రాబోతున్న "పెద్ది" సినిమా పట్ల అంచనాలు ఇప్పటికే అమాంతం పెరిగిపోతుండగా, సినిమా అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.